వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగర్ మంగ్లీ ఏం చేసింది..?: కారుపై రాళ్లు విసిరారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టాలీవుడ్ గాయని మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారుపై స్థానిక యువకులు కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంగ్లీ కారు అద్దం పగిలింది.

బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బళ్లారి ఉత్సవకు మంగ్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో పాటలు పాడి- ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్, ఆయన తమ్ముడు దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Tollywood Singer Mangli car was attacked by the local youth at Ballari in Karnataka

ఈ కార్యక్రమంలో మంగ్లీతో కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన టాప్ సింగర్స్ పాటలు పాడారు. మ్యూజికల్ నైట్ ముగించుకున్న తరువాత స్టేజీ దిగిన మంగ్లీని చూడ్డానికి పెద్ద ఎత్తున స్థానిక యువకులు గ్రౌండ్ ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి మంగ్లీ అంగీకరించలేదు.

దీనితో వారు అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్స్ లో ఆమెకు కేటాయించిన మేకప్ టెంట్ లోకి దూసుకెళ్లారు. అక్కడి వస్తువులను చిందరవందర చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇది కాస్తా- ఆ యువకులను మరింత ఆగ్రహానికి గురి చేసినట్టయింది. కార్యక్రమాన్ని ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళ్తోండగా.. కారుకు అడ్డుగా నిల్చున్నారు.

Tollywood Singer Mangli car was attacked by the local youth at Ballari in Karnataka

సెల్ఫీ దిగాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అక్కడ కూడా పోలీసులు వారికి అడ్డుకున్నారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడిన యువకులను పోలీసులు లాగి పక్కన పడేశారు. దీనితో వారు కోపంతో మంగ్లీ కారుపై రాళ్లు విసిరారు. రాళ్లు తగలడంతో కారు అద్దం పగిలింది. కన్నడలో మాట్లాడకపోవడం వల్లే వారు ఈ దాడికి పాల్పడ్డారనే వార్తలు కూడా ఉన్నాయి.

English summary
Tollywood Singer Mangli car was attacked by the local youth at Ballari in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X