టాప్ హిజ్బుల్ కమాండర్ మసూద్ అలియాస్ రహీ మృతి: మరో ఇద్దరు కూడా..
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హిజ్బుల్ టాప్ కమాండర్ మసూద్ అలియాస్ రహి చనిపోయాడు. జమ్ముకశ్మీన్‌లో జరిపిన కాల్పుల్లో రహి సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో దోడ జిల్లా ఉగ్రవాద రహిత జిల్లాగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
అనంత్ నాగ్ ఖుల్ చోహర్ వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రహీ, జిల్లా కమాండర్ సహా మరొకరు చనిపోయారని జమ్ముకశ్మీర్ డీజీపీ దలిబాగ్ సింగ్ తెలిపారు.

చనిపోయిన ఉగ్రవాది రహీ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. 2018లో భారీగా ఆయుధాలను కూడా ఎత్తుకెళ్లాడు. దోడా జిల్లాలో మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. రహీ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరాక.. దోడా నుంచి మకాం కశ్మీర్‌కు మార్చాడు.
అతని సోదరుడు ఫరూఖ్ అహ్మద్ 1999 నుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాదిగా ఉన్నాడు. జూన్‌లో అత్యధికంగా 46 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిరకు 116 మంది ఉగ్రవాదులు చనిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications