• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

J&Kలో ఎన్‌కౌంటర్: టాప్ జైషే మొహమ్మద్ ఉగ్రవాది హతం; ఎన్ఐఏ సోదాల్లోనూ నలుగురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపోరాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో టాప్ జైషే మొహమ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. అవంతిపోరాలోని ట్రాల్ ప్రాంతంలోని తిల్వాని మొహల్లా వద్ద భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, , విజయ్ కుమార్ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదిని జైషే మొహమ్మద్ కి చెందిన షామ్ సోఫీగా గుర్తించారు. ట్రాల్ ఎన్‌కౌంటర్‌లో అగ్రశ్రేణి జైషే మొహమ్మద్ కమాండర్ షామ్ సోఫీ మరణించారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఆపరేషన్ .. ఆర్మీ వర్సెస్ టెర్రరిస్ట్స్
గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లోని ఐదు ప్రధాన కార్యకలాపాలలో భద్రతా దళాలు ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం, పూంచ్-రాజౌరీ జిల్లాల సరిహద్దు సమీపంలోని షాహదారా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో ఒక కమిషన్డ్ జూనియర్ ఆఫీసర్ తో సహా ఐదుగురు భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మొత్తంగా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన మరో రెండు ఆపరేషన్లలో, ఐదుగురు ఉగ్రవాదులు పోలీసులు, భద్రతాదళాల చేతిలో హతమయ్యారు.

Top Jaish-e-Mohammed Terrorist Killed in J&K; Four terror associates arrested in NIA raids

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు .. నలుగురు అరెస్ట్
అనంతనాగ్ మరియు బందిపోరా జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో 16 ప్రాంతాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉగ్రవాద అనుబంధ సంస్థలు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న అండర్ గ్రౌండ్ వర్కర్స్ పై దాడులు నిర్వహిస్తోంది.ఈ క్రమంలో తాజాగా నలుగురు నిందితులు వసీం అహ్మద్ సోఫీ, తారిక్ అహ్మద్ దార్, బిలాల్ అహ్మద్ మీర్ అలియాస్ బిలాల్ ఫాఫు మరియు తారిఖ్ అహ్మద్ బాఫండా లను అరెస్ట్ చేసింది. వీరంతా శ్రీనగర్ వాసులని వెల్లడించింది.

ఉగ్రవాద గ్రూపుల అనుబంధ సంస్థలపై ఫోకస్ చేసిన ఎన్ఐ ఏ
శ్రీనగర్, పుల్వామా మరియు షోపియాన్ జిల్లాలలో మంగళవారం జరిపిన సోదాలలో వీరిని అరెస్టు చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. అరెస్టయిన నిందితులు ఉగ్రవాద సహచరులని, వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన గ్రౌండ్ వర్కర్స్ (OGW లు) గా పని చేస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారని ఎన్ఐఏ వెల్లడించింది.మంగళవారం నిర్వహించిన సోదాలలో, అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, నేరపూరిత జీహాది (పవిత్ర యుద్ధం) పత్రాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మరియు న్యూ ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో దాడులకు కుట్ర పన్నినందుకు ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.

ఉగ్రవాద గ్రౌండ్ వర్కర్లను టార్గెట్ చేస్తున్న ఎన్ఐఏ
ఈ సంస్థలకు చెందిన ఉగ్రవాద గ్రౌండ్ వర్కర్లు తమ పొరుగు దేశంలో ఉన్న తమ హ్యాండ్లర్లు మరియు కమాండర్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల నిర్వహణలో నియమించడం, శిక్షణ ఇవ్వడం కోసం స్థానిక యువకులను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. అనేక మంది అమాయక పౌరులను, భద్రతా సిబ్బందిని చంపడం మరియు కాశ్మీర్ లోయలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలోనే దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

English summary
Top Jaish-e-Mohammed top terrorist killed in encounter in Awantipora, Jammu and Kashmir A firefight broke out between security forces and militants at Tilwani Mohalla in Tral area .NIA also doing raids and arrested 4 militants
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X