Karnataka: బీజేపీకి పెద్ద సవాల్‌గా మారిన కొత్త సీఎం అన్వేషణ-సామాజిక సమీకరణాలపై ఎటూ తేల్చుకోలేక..!
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక విషయం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. సామాజిక సమీకరణాలు,ఎమ్మెల్యేల అభిప్రాయాలు,నాయకత్వ సమర్థత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించనుంది. కొద్దిరోజుల్లోనే కొత్త సీఎంను ప్రకటిస్తారని యడియూరప్ప చెప్పినప్పటికీ...ఆ ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యేలా కనిపించట్లేదు. యడియూరప్ప తర్వాత పార్టీలో ఆ స్థాయి నేత మరొకరు లేకపోవడంతో... బీజేపీ తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది.
Recommended Video

ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకు...
ఇదే అంశంపై చర్చించేందుకు కేంద్రమంత్రి అమిత్ షా సోమవారం(జులై 26) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఎంపిక కోసం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్,కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను అబ్జర్వర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అబ్జర్వర్లు మంగళవారం(జులై 27) బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను కోరే అవకాశం ఉంది. ఆపై వారి అభిప్రాయాలను అధిష్ఠానానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలపై ఎటూ తేల్చుకోలేక...
సామాజిక సమీకరణాలపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. లింగాయత్ వర్గానికే మరోసారి అవకాశం ఇవ్వాలా... లేక వేరే సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలా అన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది. అయితే లింగాయత్ వర్గాన్ని పక్కనపెడితే... ఏళ్లుగా బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ ఆ వర్గం ఎక్కడ పార్టీకి దూరమవుతుందోనన్న టెన్షన్ కూడా వెంటాడుతోంది. అయినప్పటికీ కొత్త ప్రయోగాలకు తెరదీయకపోతే భవిష్యత్తులో బీజేపీ అధికారాన్ని నిలుపుకోలేదన్న భావన కూడా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఏ సామాజికవర్గానికి సీఎం పదవి కట్టబెట్టినా ఇతర వర్గాలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉండటంతో నాలుగు ప్రధాన సామాజికవర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో లింగాయత్,దళిత్,వొక్కలిగ వర్గాల నుంచి ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అదనంగా కురబ సామాజికవర్గానికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది.

లింగాయత్ లేదా బ్రాహ్మణ..?
లింగాయత్ వర్గం నుంచి వెస్ట్ ధర్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్,విజయపురా ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యాత్నల్,మంత్రులు ముర్గేశ్ ఆర్ నీరణి,బసవరాజ్ బొమ్మై తదితరుల పేర్లు బీజేపీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ-షా ద్వయం ఈసారి ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకుంటారా లేక ప్రచారంలో ఉన్న పేర్లలో నుంచే ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications