తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి..
చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి జాతీయ రహదారిపై టూరిస్టు వ్యానును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
మృతులంతా కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారీగా గుర్తించినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications