ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య.. ఇద్దరి తలలు నరికి.. మొండాలతో..
భర్తలను చంపేస్తున్న భార్యలు.. భార్యలను చంపేస్తున్న భర్తలు.. ఇప్పుడు ఇలాంటి వార్తలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొందరు.. ఇతర కారణాల వల్ల మరికొందరు వివాహం అయిన కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు. ఇంకొందరు ఏకంగా కట్టుకున్న వ్యక్తి ప్రాణాలను తీస్తున్నారు. దీంతో ప్రస్తుతం యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. గతంలో పెళ్లంటే నూరేళ్ల పంట అని అనేవాళ్లు పెద్దలు. కానీ ఇప్పుడు పెళ్లంటే మూణ్ణెళ్ల ముచ్చటగా మారిపోయింది. ఈ క్రమంలో విడాకులు, మరణాలు కూడా ఆ రేంజ్ లోనే జరుగుతున్నాయి.
తాజాగా తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా భార్య, ఆమె ప్రియుడిని భర్త పట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఇద్దరినీ నరికి చంపాడు. వారి తలలు వేరు చేశాడు. వారి తలలను స్థానిక వెల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా మేడపై మహిళ, ఆమె ప్రియుడి మొండాలు కనిపించాయి. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్లకురిచి జిల్లాకు చెందిన కోలంజీ(48) వుడ్ కట్టింగ్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య లక్ష్మి(37).. తంగరసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తాజాగా కోలంజి ఇంటికివచ్చి చూసే సరికి భార్య లక్ష్మీ.. తంగరసుతో ఉంది. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. కోలంజి.. వాళ్ళిద్దరినీ అక్కడే చంపేసి తలలు వేరు చేశాడు. ఆ తర్వాత తలలను బండికి కట్టుకుని వెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడ సరెండర్ అయ్యాడు. కోలంజి, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications