ఆగిన రైలు దిగి.. వేగంగా మరోరైలు వస్తున్నా.. వీళ్ళేం చేశారో చూడండి: వీడియో వైరల్!!
ఎటువంటి సందర్భంలోనూ రైలు పట్టాలు దాటకూడదని రైల్వే శాఖ నెత్తీనోరు కొట్టుకుని మొత్తుకుంటున్నా, ఎక్కడపడితే అక్కడ రైలు పట్టాలను దాటే వారు తారసపడుతూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో రైళ్లు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైల్వే స్టేషన్ లలో ఫ్లాట్ఫామ్ మీదకు వెళ్లేటప్పుడు కూడా చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి కాకుండా రైలు పట్టాలు దాటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి సాహసాలు చేసే వాళ్ళు ప్రమాదంతో చెలగాటమాడుతున్నట్టే అని పదే పదే హెచ్చరిస్తున్నారు.

ఆగిన ట్రైన్ దిగి ట్రాక్ దాటిన ప్రయాణికులు
ఇక తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక వీడియో రైల్వే కి సంబంధించిన ప్రజల అవగాహనను ప్రశ్నిస్తుంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రజల తీరును కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చత్తీస్ గడ్ క్యాడర్ కు చెందిన అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్రాసింగ్ కారణంగా సిగ్నల్ పడడంతో రైల్వే స్టేషన్ రాకముందే ఒక ట్రైన్ నిలిచిపోయింది .ఇక కొందరు ప్రయాణికులు రైలు దిగి పక్కన ఉన్న ట్రాక్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు.
మరో రైలు వేగంగా రావటంతో ట్రాక్ పక్క కూర్చున్న జనం
సామాను తీసుకొని కొందరు ట్రాక్ దాటగా, మరికొందరు రైలు దిగి పక్కనే ఉన్న ట్రాక్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు.ఒకరు కాదు ఇద్దరు కాదు గుంపులుగా దిగిన జనం ట్రాక్ దాటి వెళ్ళారు. ఈలోపు రైలు వేగంగా దూసుకు రావడంతో కొందరు ఆగిపోయి భయంతో ఆగి ఉన్న రైలుకు ఆనుకుని కూర్చున్నారు.
ట్రాక్ పక్కకు భయంతో కూర్చుండిపోయారు. ఇక ఏకంగా ఒక మహిళ అయితే తన బ్యాగ్ ట్రాక్ ఇవతల ఉండిపోయిందని, అవతల నుండి ఇవతలకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరికీ ఈ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ, పొరపాటున రైలు ఢీ కొట్టి ఉంటే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఇక ఆగిన రైలు కదిలినా వారికి ప్రమాదం జరిగేది. ఈ నేపధ్యంలోనే ఈ వీడియో పోస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి ఎవరు ఇటువంటి ప్రమాదకర సాహసాలు చేయొద్దని, ప్రాణాలకు రిస్కు చేయొద్దని ట్వీట్ చేశారు.

బ్యాగ్ కోసం ట్రాక్ దాటిన యువతి .. జస్ట్ మిస్ .. నెటిజన్లు ఫైర్
ఇక యువతి సడన్ గా ట్రాక్ దాటడంతో సరిపోయింది కానీ, లేకుండా యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అని జస్ట్ మిస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక అంతగా అ బ్యాగ్ లో ఏముంది తల్లీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడో ఆగి ఉన్న రైలు దిగి, ట్రాక్ దాటి మరో రైలు వస్తుంది అది గమనించకుండా వెళ్తున్న వారి పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రిస్క్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. రెప్పపాటులో మిస్ అయిందని అంటున్నారు.

ప్రాణం పోతే రాదంటూ ఆగ్రహం .. ఇలా చేస్తే పోతారని వార్నింగ్
ఒక 10 నిమిషాలు ఆలస్యంగా అయినా ఇళ్లకు వెళ్ళవచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేము అంటూ, ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరు ఇటువంటి ప్రయోగాలు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. జీవితం మీది అయినప్పుడు, నిర్ణయం కూడా మీదే అయి ఉండాలని, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇలా చేస్తే ఖచ్చితంగా పోతారని పలువురు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications