రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం.. ఫైన్ కట్టమంటే రచ్చ.. ఆపై
రైల్లో ప్రయాణం చేసే వాళ్ళు కచ్చితంగా టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయాలి. టికెట్ లేని ప్రయాణం చేసే ప్రయాణికులపైన టీసీలు చర్యలు తీసుకుంటారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే వారికి ఫైన్లు వేస్తారు. రైలు నుంచి కిందికి దింపేస్తారు . ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అయితే ముంబైలోని బోరివలి రైల్వేస్టేషన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన ఒక వ్యక్తి విధ్వంసం సృష్టించడం.
రైల్వే సిబ్బందిపై దాడికి దిగిన ప్రయాణికుడు
ముంబైలో టికెట్ తనిఖీల సందర్భంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన ఒక వ్యక్తి టిసి కార్యాలయంలో బీభత్సం సృష్టించి రైల్వే సిబ్బందిపైనే దాడికి దిగాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోరివాలి రైల్వేస్టేషన్లో రైల్వే అధికారులు సబర్బన్ రైళ్లలో విస్తృతంగా టికెట్ తనిఖీలను చేస్తున్న వేళ, తనిఖీలలో నలుగురు ప్రయాణికులు పట్టుబడ్డారు. దీంతో టీసీ దాదర్-విరార్ లోకల్ రైలులోంచి వారిని దింపివేశారు.

టికెట్ లేకుండా ప్రయాణం.. ఫైన్ చెల్లించమంటే హంగామా
ఇక వీరిలో ముగ్గురు సెకండ్ క్లాస్ టికెట్లతో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తుండగా, ఒకరు అసలు టికెట్టు లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తి కి జరిమానా విధించడం కోసం అతడిని టి సి కార్యాలయానికి తీసుకువెళ్లారు. దీంతో అతను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఫైన్ చెల్లించమని అడగగా ఆ వ్యక్తి బూతులు తిడుతూ నానా హంగామా చేసాడు.
రైల్వే ఆస్తులు ధ్వంసం చేసిన ప్రయాణికుడు
ఆఫీసులోని కంప్యూటర్ కీబోర్డ్ లు, మానిటర్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేసాడు. రైల్వే సిబ్బంది అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారి పైన దాడికి పాల్పడ్డాడు. ఇక అతను చేసిన దాడిలో ఒక రైల్వే ప్రయాణికుడికి, ఒక టి సి కి గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
ఇష్టారాజ్యంగా రైల్వే సిబ్బంది పైన దాడి చేసి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన సదర్ వ్యక్తి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించడం మాత్రమే కాకుండా రైల్వే సిబ్బంది పైన దాడి చేయడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరంగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
దాడులకు పాల్పడితే కఠినమైన చట్టాలు
ఆ వ్యక్తికి కఠినమైన శిక్షలు పడతాయని వారు తేల్చి చెప్పారు. రైల్వే చట్టాల ప్రకారం రైల్వే ఆస్తుల విషయంలో, రైల్వే సిబ్బంది విషయంలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠినమైన చట్టాలు ఉన్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications