మెర్సికిల్లింగ్‌ కోసం ట్రాన్స్‌జెండర్ పొన్నుస్వామి రాష్ట్రపతికి లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ఉద్యోగం నిరాకరించడంతో ఓ ట్రాన్స్‌జెండర్ మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌కు లేఖ రాసింది.శాన్వి పొన్నుస్వామి అనే ట్రాన్స్‌జెండర్ ఎయిరిండియాలో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడంపై సుప్రీం కోర్టులో 2017 నవంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో కేంద్ర పౌరవిమానాయానశాఖ, ఎయిరిండియాను స్పందించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ఇంతవరకు ఎయిరిండియా కానీ, కేంద్ర పౌరవిమానాయానశాఖ కానీ, స్పందించలేదని శాన్వి పొన్నుస్వామి రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది.

 Transgender Writes to President Seeking 'Mercy Killing' After Air India Denies Job

ఎయిరిండియాలో ఉద్యోగం దక్కకపోవడంతో తనకు చనిపోయేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని ఆమె ఆ లేఖలో కోరింది.

తాను జీవించేందుకు ఇబ్బందిగా ఉన్న విషయమై స్పందించేందుకు ఉపాధి కల్పించే విషయమై ప్రభుత్వం సిద్దంగా లేనందున చనిపోయేందుకు అవకాశం కల్పించాలని ఆమె రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు.

ఈ మేరకు ఆమె ఈ లేఖను తన ఫేస్‌బుక్ పేజీలో కూడ పోస్ట్ చేశారు.ఏడాదిపాటు ఎయిరిండియాలో ఉద్యోగం చేసిన తర్వాత తాను జెండర్ మార్చుకొన్నట్టు చెప్పారు.

అయితే జెండర్ మార్చుకొన్న తర్వాత తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎయిరిండియా నుండి సానుకూల స్పందన రాలేదని ఆమె చెప్పారు.ఈ తరుణంలో రెండేళ్ళ కాలంలో ఎయిరిండియాను నాలుగు సార్లు సంప్రదించినా పలితం లేకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. అయితే తన జీవనం కష్టంగా మారిన నేపథ్యంలో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ఆమె ఆ లేఖలో రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌ను కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A transgender has written to President Ram Nath Kovind seeking mercy killing after being denied a job as a cabin crew member in Air India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి