వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛక్కా జామ్: స్తంభించిన దేశ రాజధాని: పాఠశాలలు మూత..రోడ్డెక్కని వాహనాలు! శాంపిల్ మాత్రమేనట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. 24 గంటలు పాటు రద్దీగా కనిపించే దేశ రాజధాని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలేవీ రోడ్డెక్కలేదు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీకి చేరుకునే వందలాది లారీలు, ట్రక్కులు, క్యాబ్ లు, ట్యాక్సీలు.. చివరికి ఆటోలు మెరుపు సమ్మెకు దిగడమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన వాహన చట్టాన్ని నిరసిస్తూ రవాణా సంఘాల సమాఖ్య (యుఎఫ్టీఏ) ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేటు వాహన సంస్థలు సమ్మెకు దిగాయి. ఫలితంగా- న్యూఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం..

తాహతుకు మించిన ట్రాఫిక్ చలాన్లను వసూలు చేస్తుండటమే సమ్మెకు ప్రధాన కారణం. చలాన్ల మోతను మోగిస్తున్నారని, ఒక్కో ట్రక్కుకు లక్ష రూపాయలకు పైగా చలాన్లను విధించిన సందర్భాలు ఉన్నాయని రవాణా సంఘాల సమాఖ్య ఛైర్మన్ హరీష్ సబర్వాల్ ఆరోపించారు. తమకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సమ్మెకు దిగేలా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు తమను ప్రేరేపించాయని విమర్శించారు. దేశ రాజధాని ప్రాంతంలో ఒకరోజు వాహనాల రాకపోకల సమ్మె ఫలితం వల్ల సంభవించే నష్టమేంటో ప్రభుత్వానికి తెలుసునని ఆయన అన్నారు. తమ నిరసనను తెలియజేయటానికి ఈ సమ్మె ఒక శాంపిల్ మాత్రమేనని హరీష్ సబర్వాల్ అన్నారు. చలాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దారిస్తామని అన్నారు.

23 వేల కోట్లు నష్టం..

23 వేల కోట్లు నష్టం..

యూఎఫ్టీఎ.. దేశంలోనే అతి పెద్ద రవాణా సంఘాలతో కూడిన సమాఖ్య. ట్రక్కులు, ప్రైవేటు బస్సులు, లారీలు, మ్యాక్సీ క్యాబ్ లు, ఆటోలు.. ఇలా 41 వాహనా సంఘాలకు ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. దేశ రాజధానిలో సుమారు 80 శాతం మేర వాహన సంఘాలతో కూడిన యూఎఫ్టీఏ సమ్మెకు పిలుపునిచ్చిన ప్రభావం.. దేశ రాజధానిలో వాహనాల రాకపోకలపై తీవ్రంగా పడింది. రవాణా సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన ఈ ఒక్కరోజు సమ్మె వల్ల కనీసం 23 వేల కోట్ల రూపాయల మేర క్రయ, విక్రయాలు స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు బస్సులు, ఆటో రిక్షాలు, యాప్, ఆన్ లైన్ ఆధారిత క్యాబ్ లు, ట్యాక్సీలు, వివిధ పాఠశాలు, కళాశాలల వాహనాలన్నీ సమ్మెలో పాల్గొనడం చారిత్రాత్మకమని చెబుతున్నారు.

పాఠశాలలు, విద్యాసంస్థలు మూత

పాఠశాలలు, విద్యాసంస్థలు మూత

విద్యార్థుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ వాహనాలకు మినహాయింపు ఇవ్వాలంటూ ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని యూఎఫ్టీఏ ప్రతినిధులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు, కళాశాలల బస్సులను సైతం తిప్పబోమని వెల్లడించారు. ఫలితంగా- గురువారం నాడు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అన్ని విద్యాసంస్థలను మూసి వేయాలని నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ ఛైర్మన్ సుభాష్ జైన్ తెలిపారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని గుర్ గావ్, ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్ జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు ఢిల్లీ నుంచి ఆయా జిల్లాల్లో నెలకొన్న ఇంజినీరింగ్ కళాశాలకు రావాల్సి ఉన్నందున.. వాటికి కూడా సెలవు ప్రకటించినట్లు సుభాష్ జైన్ తెలిపారు. బలవంతంగా స్కూల్ బస్సులను గానీ, ఆటోలను గానీ నడిపితే.. దాడులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు.

English summary
Schools in the National Capital Region will remain closed on Thursday as transport associations in Delhi and Noida have called for a strike to protest against the hefty penalties for road traffic violations under the newly amended Motor Vehicles (MV) Act. Commuters are likely to face problems as public transport would be off the roads on Thursday. The strike comes days after Delhi chief minister Arvind Kejriwal said the new law has improved traffic situation on Delhi roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X