వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ అహ్మద్ : ఐదుగురికి జీవం పోసి .. ఊపిరొదిన వీరుడు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : తానో పర్యాటక గైడ్ .. కానీ తన బోటు మునగడంతో పడవలో ఉన్న పర్యాటకులను రక్షించారు. కానీ తాను మాత్రం ఆ గాలి దుమారంలో చిక్కుకొని .. విగతజీవిగా మారాడు. సుందర ప్రాంతం కశ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. దార్ తెగువపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.

బోటు బోల్తా ..
కశ్మీర్ లోని మవూర పహల్గాం వద్ద గల లిద్దార్ పర్యాటక క్షేత్రం. ఇక్కడున్న నదీలో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పటిలాగే ఐదుగురు పర్యాటకులు శుక్రవారం వచ్చారు. వీరికి గైడ్ గా రావు అహ్మద్ దర్ పనిచేశారు. నిన్న నదీలో విహరిస్తుండగా బోటు బోల్తాపడింది. ఈతగాడైన అహ్మద్ దర్ .. ఐదుగురు పర్యాటకులను కాపాడారు. కానీ అప్పటికే బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో అతను ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పర్యాటకులు తెలియజేయడంతో ఇవాళ ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అహ్మద్ దర్ మృతదేహన్ని లిద్దార్‌లో గల భవానీ బ్రిడ్జీ వద్ద గుర్తించి .. వెలికితీశారు. పంచనామా చేసి మృతదేహన్ని దర్ .. బంధువులకు అప్పగించారు.

Travel guide dies rescuing 5 tourists as boat capsizes in Pahalgam

శభాష్ అహ్మద్ ...
తనతో ఉన్న పర్యాటకులను కాపాడి .. ప్రాణాలు విడవడంపై టూరిస్ట్ గైడ్ ధైర్య సాహసాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రదర్శించిన ధైర్యం మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని అనంత్ నాగ్ డీసీపీ పేర్కొన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. కోల్పోయిన దర్ ను తిరిగి తీసుకురాలేమని .. కానీ ఆర్థికంగా చేయూతనిచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. ఇటు దార్ తెగువను నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా శ్లాఘించారు. నదిలో బోటు బోల్తా పడిన పర్యాటకులను కాపాడిన తీరు అమోఘం, సెల్యూట్ అహ్మద్ దర్ అని ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. విధి నిర్వహణలో దర్ చూపిన తెగువ .. భావితరాలకు ఆదర్శనీయమని ప్రశంసించారు.

Travel guide dies rescuing 5 tourists as boat capsizes in Pahalgam
English summary
A tourist guide died while saving tourists after a boat capsized in Lidder river in Mawoora Pahalgam area in south Kashmir's Anantnag district. Five tourists including two foreigners were on the boat when it capsized on Friday after it was caught in gusty winds. All passengers onboard fell in the river including Rouh Ahmed Dar, the tourist guide. Rouf Ahmed Dar managed to save all the passengers but went missing in the aftermath. Search and rescue operation was launched immediately and teams of SDRF, police, and locals supervised by SDM and SDPO Pahalgam searched till late hours on Friday. His body was retrieved on Saturday near Bhawani bridge from Lidder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X