మూడు రాష్ట్రాల్లో బిజెపి హవా: ఓటమి దిశగా కాంగ్రెసు

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారాన్ని కోల్పోయే స్థితి ఉంది. రాజస్థాన్‌లోని 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బిజెపి 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెసు 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. చత్తీస్‌గడ్‌లో కూడా మాత్రం పోటాపోటీ ఉంది. చ్తతీస్‌గడ్‌లో 90 స్థానాలు ఉండగా, కాంగ్రెసు 41 స్థానాల్లో, బిజెపి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ సాధించే దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో బిజెపి 133 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతుండగా, కాంగ్రెసు 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మిజోరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications