తండ్రి నీచపు పనికి గర్భం దాల్చిన కూతురు..

కేరళ : కేరళలోని వైతిరిలో దారుణం చోటు చేసుకుంది. కనీస మానవీయ విలువలను సైతం పట్టించుకోని ఓ 46 ఏళ్ల తండ్రి 16ఏళ్ల వయసున్న సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలా.. ఒకసారి రెండుసార్లు కాదు.. విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరిస్తూ.. కూతురిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. సదరు తండ్రి చేసిన నీచపు పనికి కూతురు గర్భం దాల్చడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. బాధిత మైనర్ బాలిక ఓ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇదే క్రమంలో గత ఐదు నెలల క్రితం కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన కూతురిపై కన్నేసిన తండ్రి.. బెదిరింపులతో ఆ బాలికను లొంగదీసుకున్నాడు.

Tribal man arrested for raping minor daughter

ఈ నేపథ్యంలోనే.. కూతురి ప్రవర్తనలో తేడా గమనించిన తల్లి గత మంగళవారం నాడు కూతురికి కడుపు నొప్పి రావడంతో.. స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో ఆ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని తేల్చారు. అనంతరం వైద్యులు అందజేసిన సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించారు.

బాలిక నుంచి రాబట్టిన వివరాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ షరీఫ్.. ఆ నీచపు తండ్రిపై ఐపీసీ సెక్షన్-376 మరియు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో అతడిని హాజరుపరిచారు పోలీసులు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+