పాటలు వింటున్నాడని సజీవదహనం చేశారు
ఇండోర్: మొబైల్ లో సౌండ్ ఎక్కువ పెట్టి పాటలు వింటున్నందుకు ఓ గిరిజన యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని ధర్ జిల్లా లోని అచ్చోడ అనే గ్రామంలో మదియా (16) అనే గిరిజన బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఆగస్టు 15వ తేదిన తన అన్న అబాన్ తో కలిసి ఇంటి సమీపంలో కుర్చుని మొబైల్ లో పాటలు వింటున్నాడు.
అదే సమయంలో అటువైపు వెళ్లిన అగ్రకులాలకు చెందిన యువకులు మొబైల్ లో సౌండ్ తగ్గించాలని మదియాకు చెప్పారు. అయితే మదియా పట్టించుకోలేదు. పక్కనే ఉన్న మదియా అన్న అబాన్ జోక్యం చేసుకుని చిన్న పిల్లవాడు మేము సర్ది చెబుతామని వారిని వేడుకున్నాడు.

అక్కడి నుంచి వెళ్లిన యువకులు తరువాత 15 మందిని వెంట పెట్టుకుని వచ్చి మదియాను పట్టుకుని చితకబాదేశారు. మదియా సృహ తప్పడంతో అతనిని గ్రామంలోని చెట్టుకు వేలాడదీసి అతని మీద పెట్రోల్ పోశారు.
తరువాత మదియాను వదిలేయాలని అతని అన్న అబాన్ వారి కాళ్లు పట్టుకున్నాడు. అయితే ఆ యువకులు మదియాకు నిప్పంటించి సజీవదహనం చేశారు. విషయం బయటకు చెబితే మీకు ఇదే గతి పడుతుందని అబాన్ కుటుంబ సభ్యులను హెచ్చరించారు.
అబాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు నిరాకరించారు. అబాన్ జాగృతి దళిత్ ఆదివాసి నాయకులు హై కోర్టును ఆశ్రయించి పిటీషన్ వేశారు.
మధ్యప్రదేశ్ హై కోర్టు కేసు విచారణకు స్వీకరించింది. ధర్ జిల్లా ఎస్పీ, మనావర్ పోలీస్ స్టేషన్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని ఇండోర్ బెంచ్ జస్టీస్ ఎస్.ఆర్. వాగ్ మరే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామంలోని అగ్రకులాలకు చెందిన యువకులు గ్రామసేవాదళ్ సభ్యులతో కలసి వచ్చి తన తమ్ముడిని అతిదారుణంగా కొట్టి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి సజీవదహనం చేశారని అబాన్ తన పిటీషన్ లో పేర్కోన్నాడు.












Click it and Unblock the Notifications