షింజో అబే హత్యకు అగ్నివీరుడే కారణం-భారత్ లో అదే జరగొచ్చు- తృణమూల్ సంచలనం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఓ మాజీ సైనికాధికారి నిన్న ఎన్నికలప్రచారంలో ఉండగా కాల్చి చంపాడు. దీనిపై జపాన్ తో పాటు అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. భారత్ లోనూ అదే జరగొచ్చంటూ బెంగాల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ తన అధికార పత్రిక జాగో బంగ్లాలో తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు అగ్నివీరుడే కారణమంటూ వ్యాఖ్యలు చేసింది. సైన్యం నుంచి నాలుగేళ్ల తర్వాత తొలగించిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. భారత్ లోనూ అగ్నిపథ్ స్కీం అమలు ద్వారా ఇదే జరుగవచ్చని హెచ్చరించింది. తద్వారా కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించింది.

షింజో అబే హత్యలో అగ్నిపథ్ ఛాయ అనే హెడ్‌లైన్‌తో జాగో బంగ్లా ఇవాళ ఈ కథనాన్ని ప్రచురించింది. షింజో అబే హత్య... భారత దేశంలో అగ్నిపథ్ పథకంపై వస్తున్న వ్యతిరేకతను బలపరుస్తోందని ఈ కథనం తెలిపింది. ఎందుకంటే షింజో అబేను హత్యచేసిన వ్యక్తి కూడా గతంలో పెన్షన్ లేకుండానే సైన్యంలో పనిచేశాడని తెలిపింది. అగ్నిపథ్ పథకం వల్ల మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితులు రావచ్చని అభిప్రాయపడింది.దీంతో టీఎంసీ ఆరోపణలు సంచలనంగా మారాయి.
నిన్న షింజో అబే హత్యకు వాడిన ఆయుధాన్ని మాజీ సైనికుడైన యమగామి స్వయంగా తయారు చేశాడు. దాంతోనే ఆయన షింజో అబేను హతమార్చాడు. దీంతో ఈ వ్యవహారం దేశంలోనూ చర్చనీయాంశమవుతోంది. తాత్కాలిక ప్రాతిపదికన జరిగిన అతని నియామకమే ఈ హత్యవెనుక కారణంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ లో అగ్నిపథ్ తో లింక్ చేస్తూ టీఎంసీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశవుతున్నాయి.












Click it and Unblock the Notifications