"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోగా, రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ఈ కీలక సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఘనంగా విడుదల చేసింది. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని హామీ ఇస్తూ 'ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి భరోసా' అనే నినాదంతో ముందుకెళ్తోంది. బెంగాల్ ఓటర్లను ఆకర్షించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా 10 కీలక హామీలు ప్రకటించారు. మరోసారి తమ పార్టీని గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామన్నారు.
మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..
మహిళలు, యువతకు ఆర్థిక భరోసా..
మ్యానిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. 'లక్ష్మీర్ భండార్' పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని పెంచుతూ, జనరల్ వర్గాల మహిళలకు నెలకు ₹1500, ఎస్సీ/ఎస్టీ మహిళలకు ₹1700 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా నిరుద్యోగ యువత కోసం 'యువ సాథి' పథకం ద్వారా నెలకు ₹1500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. యువతలో స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు.

రైతులకు ప్రత్యేక బడ్జెట్ & వ్యవసాయాభివృద్ధి..
రైతుల సంక్షేమం కోసం ₹30,000 కోట్ల భారీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని మమతా బెనర్జీ ప్రకటించారు. భూమిలేని రైతులకు ఆర్థిక సాయం, పంటల బీమా, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గృహాలు & తాగునీరు..
ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడం, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటి కనెక్షన్ అందించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
ఆరోగ్యం..
'దువారే చికిత్స' పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేలా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యలో విప్లవాత్మక మార్పులు..
'బంగ్లార్ శిక్షాయతన్' పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, ఈ-లెర్నింగ్ సదుపాయాలు కల్పించి ప్రపంచ స్థాయి విద్య అందించడంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమలు & వాణిజ్యానికి ప్రాధాన్యం..
బెంగాల్‌ను తూర్పు భారతదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని మమతా హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌లు, పోర్టులు, గ్లోబల్ ట్రేడ్ సెంటర్‌ల అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించి, ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. ఐటీ, టెక్స్టైల్, MSME రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
I humbly present my 10 ‘Protigya’ for Bengal, so that the wheels of development continue to move forward in the fourth term of my government.
— Mamata Banerjee (@MamataOfficial) March 20, 2026
Under Lakshmir Bhandar, with an increase of ₹500, women will continue to receive monthly financial assistance of ₹1,500 for General… pic.twitter.com/qt3TUInByi
ఏడు కొత్త జిల్లాలు..
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడానికి రాష్ట్రంలో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదనంగా మున్సిపాలిటీలను పెంచి, స్థానిక పాలనను బలోపేతం చేస్తామని తెలిపారు.
వృద్ధులకు భరోసా..
వృద్ధాప్య పింఛన్‌ను నిరంతరంగా అందించడంతో పాటు, అర్హులైన ప్రతి వృద్ధుడిని ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సామాజిక భద్రతా పథకాలను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.
ఇక మ్యానిఫెస్టో విడుదల అనంతరం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం NRC, జనగణన పేరుతో ప్రజల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో 'అనధికార రాష్ట్రపతి పాలన' అమలు చేస్తున్నారని విమర్శించారు. తాను విభజన రాజకీయాలు చేయనని, అన్ని మతాల ప్రజలు తనకు సమానమని మమతా స్పష్టం చేశారు. ప్రజలు భయపడకుండా, డబ్బు ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మొత్తంగా చూస్తే, మమతా బెనర్జీ ప్రకటించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక పురోగతి అనే మూడు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలు, యువత, రైతులు, వృద్ధులు వంటి అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ హామీలు ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications