బిజెపిలో చేరిన ట్రిపుల్ తలాక్ పిటిషనర్ ఇష్రత్ జహన్
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విషయమై సు,ప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన ఇష్రత్ జహన్ ఆదివారం నాడు బిజెపిలో చేరారు. ఈ విషయాన్ని బిజెపి బెంగాల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు ప్రకటించారు. ఇష్రత్ జహన్‌ను త్వరలోనే ఘనంగా సన్మానించనున్నట్టు బసు ప్రకటించారు.
ట్రిపుల్ తలాక్ నిరసిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేసిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ ఒకరు. దుబాయ్ నుండి భర్త ఫోన్లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటానికి దగింది.

గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చింది. కేంద్ర ప్రభుత్వం కూడ ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు తీసుకువచ్చింది. బిజెపిలో చేరిన తర్వాత ఇష్రత్ జహన్ మాత్రం ఈ విషయమై స్పందించలేదు.
మరో వైపు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించనుందని ప్రధానమంత్రి మోడీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications