ఆ చట్టం అంతు చూసేంత వరకు నిద్రపోను: ట్రిపుల్ తలాక్ పై ప్రధాని మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై రాజకీయం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం మత పెద్దలను కోరారు. దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు ముస్లిం సంస్కరణవాదులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అభ్యర్థించారు.

శనివారం భువనేశ్వర్‌లో కన్నడ తత్వవేత్త బసవన్న జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్‌కు ముస్లిం మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని, వారికి జరుగుతున్న అన్యాయంపై స్వరం మరింత పెంచుతానన్నారు.

pm-modi

''దేశంలోని ముస్లిం ఆడబిడ్డల వెతలపై పోరాటం చేస్తా.. కాలం చెల్లిన ట్రిపుల్ తలాక్ చట్టానికి మా ప్రభుత్వం ముగింపు పలుకుతుంది'' అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా ముస్లిం మహిళల మాదిరిగానే భారత దేశంలోని ముస్లింలను కూడా ఆధునిక పథంలో నడిపించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

దాదాపు నలభై నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలనపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi said on Saturday that the issue of ‘triple talaq’ should not be seen from the political prism even as he reached out to the Muslim community. He urged the community to come forward and find a “solution” to the contentious issue, assuring that the central government led by his Bharatiya Janata Party will bring an “end to this archaic law”. “Reformers from the (Muslim) community itself will come forward to protect women from the ill-effects of triple talaq,” news agency PTI quoted Modi as saying at an event in Delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి