ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆర్నెల్ల పాటు చెల్లుబాటు కాదు

ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ట్రిపుల్ తలాక్‌ను సమర్థించింది. తలాక్‌పై అభ్యంతరాల మీద పార్లమెంటు చట్టం చేయాలని సూచించింది.

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అదే సమయంలో తలాక్‌పై అభ్యంతరాల మీద పార్లమెంటు చట్టం చేయాలని సూచించింది. చట్టంలో మార్పుల ద్వారానే వ్యవస్థను మార్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది.

చట్టం తెచ్చేందుకు ఆరు నెలల సమయం ఇచ్చింది. ఈ ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ పైన స్టే విధించింది. ఈ ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదు. ముస్లీంల విడాకుల కోసం చట్టం తీసుకు రావొచ్చునని తెలిపింది.

Triple talaq struck down by Supreme Court by 3:2 majority

ఇది మతపరమైన అంశమని, ముస్లీంల విడాకుల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకు రావొచ్చునని తెలిపింది. ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని పేర్కొంది. చట్టం చేసే వరకు ట్రిపుల్ తలాక్‌పై పిటిషన్లను విచారణకు స్వీకరించమని తెలిపింది.

కాగా, చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఐదుగురు జడ్జిల్లో ఇద్దరు ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

ముస్లీంలలోనే భిన్నాభిప్రాయాలు కనిపించాయి. ఇది చట్ట సమ్మతం కాదని, రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం అంటోంది. తలాక్‌కు వ్యతిరేకంగా కేంద్రం వాదనలు వినిపించింది. ముస్లీం మహిళల హక్కులు కాలరాస్తోందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+