త్రిపుర పోరు- కింగ్ మేకర్ గా మారిన మాజీ రాజవంశస్తుడు- ఎవరీ ప్రద్యోత్ దేవ్ వర్మ..?
ఈ నెల 16న అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న త్రిపురలో అధికార పార్టీ బీజేపీతో పాటు ఇతర పార్టీలకు స్ధానిక పార్టీల కూటమిగా ఏర్పడిన ఓ పార్టీ చుక్కలు చూపిస్తోంది. అంతే కాదు ఇప్పుడు పార్టీ అధినేత చేస్తున్న డిమాండ్ ఈ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. దీంతో ఆ పార్టీ అధినేత పేరు కూడా అంతే స్ధాయిలో మార్మోగుతోంది.
త్రిపుర పోరులో అధికార బీజేపీ మరోసారి ఇక్కడ గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల్ని ఎదుర్కొంటే చాలు ఇక్కడ అధికారంలోకి రావొచ్చని నిరూపించిన బీజేపీకి ఈసారి పరిస్ధితి మాత్రం అంత సులువుగా లేదు. దీనికి కారణం స్ధానిక పార్టీలతో ఏర్పడిన తిప్రా మోథా పార్టీ. ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాజవంశస్తుడు ప్రద్యోత్ దేవ్ వర్మ. ఆయన వినిపిస్తున్న ప్రత్యేక తిప్రా ల్యాండ్ డిమాండ్ ఇప్పుడు బీజేపీతో పాటు మిగతా పార్టీలకూ చుక్కలు చూపిస్తోంది.

త్రిపుర జనాభాలో దాదాపు 32 శాతం ఉన్న గిరిజనుల కోసం ప్రద్యోత్ దూకుడుగా చేస్తున్న ప్రచారం, ప్రత్యేక తిప్రాల్యాండ్ డిమాండ్ రెండేళ్లుగా ఈ మాజీ రాజవంశస్తుడిని ప్రత్యేకంగా మార్చేశాయి. తాజాగా బీజేపీ ఆయన నేతృత్వంలోని తిప్రా మోథా కూటమితో జట్టు కట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. అంతే కాదు తాజాగా గిరిజన నియోజకవర్గాల్లో ఆయన సాగిస్తున్న ప్రచారం బీజేపీ అవకాశాలకు గండికొట్టబోతోంది.

2019వరకూ కాంగ్రెస్ లో ఉన్న ప్రద్యోత్.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశాక క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని వెంటనే తిప్రహా స్వదేశీ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ అని పిలిచే తిప్రా మోతా పార్టీని స్థాపించారు. 2021 త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో అధికార బిజెపిని ఓడించి విజయం సాధించారు. ఈసారి ఇది అసెంబ్లీలోని 60 సీట్లలో 42లో పోటీ చేస్తోంది. దీంతో బీజేపీతో పాటు ఇతర పార్టీలకుచుక్కలు కనిపిస్తున్నాయి. ఆయనకు గిరిజనుల్లో బాగా ప్రభావం ఉన్నప్పటికీ ఇతర వర్గాలకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ ప్రద్యోత్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. గతంలో రాజవంశస్తుడిగా ఉన్న ప్రద్యోత్... ఈసారి ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉంటూ కింగ్ మేకర్ గా మారడంతో మిగతా పార్టీలు ఆయన్ను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications