బాబుపై నిప్పులు చెరిగిన ఎంపీ సుమన్

TRS MP Balka Suman fires on Chandrababu Naidu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తాడు. మంచిర్యాల మండలంలోని ముల్కాల జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను అడ్డుకున్నది ద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్‌ను ఆమోదించింది బాబు కాదా అని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో కరెంట్ కోతలపై ఆందోళన చేసిన రైతులపై బాబు కాల్పులు జరిపించాడని అన్నారు. వీటన్నింటిపై టీ టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జలాల మూడోదశ పనులను పరిశీలించిన పద్మారావు

నల్గొండ జిల్లాలోని కోదండాపూర్‌లో కృష్ణా జలాల మూడో దశ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పరిశీలించారు. మార్చి వరకు కాకుండా డిసెంబర్‌లోనే నగర ప్రజలకు కృష్ణా జలాలను అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.

కృష్ణా మూడో దశ పనులపై సీఎం కేసీఅర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. అవసరమైతే నాలుగో దశ పనులను కూడా చేపడుతామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో డిప్యూటీ సీఎం, హోం మంత్రితో పాటు తాను కూడా మరోసారి కృష్ణా జలాల మూడోదశ పనులను పర్యవేక్షిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+