ప్రమాదాలు: కర్ణాటకలో 21, ఆంధ్రలో 8 మంది మృతి

శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం ప్రాంతంలోని హళకిలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను కర్ణాటకలోని సురాపురా తండాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయానికి టెంపోలో 35 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై టాటా సుమోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నెల్లూరులోని రొట్టెల పండుగకు టాటా సుమోలో వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మృతులు కడప జిల్లా రాయచోటికి చెందినవారు. టాటా సుమోలో ప్రమాదం జరిగినప్పుడు 14 మంది ఉన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మిగతా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications