కంటైనర్ దూసుకొచ్చి 12 మంది భక్తుల దుర్మణం

 Truck runs over 12 pilgrims in Bihar's Aurangabad
ఔరంగాబాద్: బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఘోరమైన ప్రమాదం సంభవించింది. నిద్రలో ఉన్న శివభక్తులపైకి ఓ కంటైనర్ లారీ దూసుకెళ్లడంతో 12 మంది మరణించారు. కంటైనర్ లారీ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన శివభక్తులంతా రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్‌కత్తా రెండవ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ చెప్పారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు.

శివభక్తులంతా జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని తిరిగి వస్తున్నారని, ఈ క్రమంలో ప్రయాణ బడలికతో తాము ప్రయాణిస్తున్న బస్సును రోడ్డు పక్కనే ఆపి, ఆ పక్కన నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ చెప్పారు. అదే రహదారిపై వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+