Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో భారీ షాక్.. ఏకంగా యూనివర్సిటీలకు మెమోలు!

యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల పైన అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఫీజు భారీగా పెంచి, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి షాక్ ఇచ్చిన ట్రంప్ అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల ప్రవేశాల పై పరిమితులు విధించాలని నిర్ణయించారు.

విదేశీ విద్యార్థులకు ట్రంప్ చెక్
అమెరికాలో ఇతర దేశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం విద్యను అభ్యసించడానికి వెళుతుంటారు. అయితే అలా అమెరికాకు వెళ్లే వారిలో భారతదేశానికి చెందిన వారే ఎక్కువమంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నత విద్యాభ్యాసం కోసం యూఎస్ కు వెళ్తారు. ఇక అటువంటి వారికి చెక్ పెట్టాలని భావించిన దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు మెమోలు పంపించారు.

Trump another shock to foreign students Memos to universities

యూఎస్ యూనివర్సిటీలకు మెమోలు
ఈ మెమో లలో విదేశీ విద్యార్థుల ప్రదేశాలపై పరిమితులు విధించాలని ఆదేశించారు. ఒకవేళ విదేశీ విద్యార్థుల ప్రవేశాల పైన యూనివర్సిటీలు పరిమితులు విధించక పోతే ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులను ఇవ్వమని అందులో పేర్కొన్నారు. వైట్ హౌస్ నుంచి పంపించిన మెమోలలో అనేక నిబంధనలను పేర్కొని, ఆ నిబంధనలను అంగీకరించిన విశ్వవిద్యాలయాలకు మాత్రమే ప్రభుత్వ నిధులు లభిస్తాయని స్పష్టం చేశారు.

యూఎస్ యూనివర్సిటీలు పాటించాల్సిన నిబంధనలు
విదేశీ విద్యార్థుల సంఖ్యపైన పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాల నిలుపుదల, విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ప్రామాణిక పరీక్షలు తప్పనిసరి చేయడం యూనివర్సిటీ పాటించవలసిన షరతులలో ముఖ్యమైనవి. ఎవరైతే ప్రభుత్వనిధులు పొందాలి అనుకుంటారో వారు ఈ షరతులను నెరవేర్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వరుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, పరిశోధనల నిధులు, విదేశీ స్కాలర్ లకు వీసా అనుమతులు, పన్ను కోడ్ ప్రాధాన్యత వంటివి లభిస్తాయని వైట్ హౌస్ ఆ మెమోలో పేర్కొంది.

యూనివర్సిటీలకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించకూడదు
ముఖ్యంగా యూనివర్సిటీలకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించకూడదని పేర్కొంది. ఒక దేశం నుంచి యూఎస్ కి వచ్చే విద్యార్థుల సంఖ్య ఐదు శాతానికి మించకూడదని వెల్లడించింది. విదేశాల నుంచి అందే నిధుల వివరాలను బహిర్గతం చేయాలని, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు కచ్చితంగా SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్షలను పూర్తి చేయాలని పేర్కొంది.

ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చెయ్యాలి
విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలను అమలు చేయాలని, విశ్వవిద్యాలయాలకు ఆటంకం కలిగించే రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించడాన్ని నివారించాలని పేర్కొంది. ఉద్యోగులు అధికారిక విధుల్లో రాజకీయ ప్రసంగాలకు, చర్యలకు దూరంగా ఉండాలని వెల్లడించింది. లాకర్ రూమ్ లు, బాత్రూంలు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలని మెమోలో పేర్కొంది.

ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధి రెండేళ్లపాటు నిలుపుదల
హార్డ్ సైన్స్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజు ప్రోత్సాహం కింద రెండు మిలియన్ డాలర్లకు మించి ఇవ్వాలని ప్రతిపాదించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ నిబంధనల అమలును సమీక్షిస్తుంది అని, వీటిని ఉల్లంఘించిన విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ లబ్ధి రెండేళ్లపాటు నిలిపివేస్తామని వైట్ హౌస్ పేర్కొంది. ఈ నిర్ణయం హెచ్1బి వీసా ప్రాసెసింగ్ పైన కూడా ప్రభావం చూపించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+