త్వరలో భారత్ కు రానున్న ట్రంప్.. ముహూర్తం ఫిక్స్!
గత కొంతకాలంగా ట్రంప్ సుంకాల కారణంగా భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలపైన నీలి నీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. భారత్ పైన భారీసుంకాల భారాన్ని మోపిన ట్రంప్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి సాకుగా చూపి భారత్ ను టార్గెట్ చేశారు. అయితే అందుకు దీటుగా సమాధానం చెప్పిన భారత్, తమ దేశ ప్రయోజనాల కోసం తాము ఎవరి నుండైనా కావలసినవి కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పింది.
భారత్ కు ట్రంప్
ఒక దశలో యూఎస్ వెళ్లాల్సిన ప్రధాని మోదీ యూఎస్ పర్యటన సైతం క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. అయితే మళ్లీ ట్రంప్ ప్రధాన మోడీకి స్నేహ హస్తం అందించడంతో, భారత ప్రధాని కూడా అందుకు తగ్గట్టు స్పందించారు. ప్రస్తుతం ట్రంప్ భారత్ పర్యటనకు రానున్నారు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.

ట్రంప్ భారత్ పర్యటనకు సంబంధించి చర్చలు పూర్తి
ఈ పర్యటన ద్వారా భారతదేశాన్ని చైనాకు దూరం చేయడమే లక్ష్యమని భారత్ కు అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీన వాషింగ్టన్ లో సెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీతో జరిగిన సమావేశంలో గోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. డోనాల్డ్ ట్రంప్ క్వాడ్ కూటమిని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్న ఆయన, ట్రంప్ పర్యటనకు సంబంధించి చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు.
క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్
ఈ ఏడాది చివర్లో భారత్ క్వాడ్ దేశాధినేతల సదస్సును నిర్వహించబోతున్నదని, ఆ సదస్సుకు ట్రంప్ హాజరవుతారని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఖచ్చితమైన తేదీ నిర్ణయించబడుతుంది అని, గత ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరుకావాలని ట్రంప్ ని ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.
భారత్ తో సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యం
భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం తాము ప్రాధాన్యతను ఇస్తున్నామని, భారత్ అమెరికా చేరువ కావడం , చైనా ప్రభావం నుండి భారతదేశాన్ని దూరం చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్ అమెరికా దేశాల మధ్య ఉన్న తాత్కాలిక అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా వాళ్లతో పోలిస్తే, అమెరికన్స్ తోనే భారతదేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దశాబ్దాలుగా భారతదేశ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని గోర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications