చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: దర్శనం టిక్కెట్లు ఉంటేనే అలిపిరిలో ఎంట్రీ, టీటీడీ విద్యాసంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు, గ్రేట్ !

|
Google Oneindia TeluguNews

తిరుమల/ తిరుపతి: తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్బంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం ముందుగా దర్శనం టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వెళ్లడానికి అవకాశం ఇస్తామని, దర్శనం టిక్కెట్లు లేని భక్తులు తిరుమల కొండ మీదకు వెళ్లడానికి అవకాశం ఇవ్వమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్నవారు వాక్సినేషన్ సర్టిఫికెట్లు కానీ, లేదా దర్శానానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు టీటీడీ అధికారులు మనవి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని పలు పాఠశాలలు మరో ఘనత సాధించాయి. టీటీడీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు వచ్చాయి. టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చేతులు మీదుగా టీటీడీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందుకున్నారు.

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, కోవిడ్ నియమాలు, టీటీడీ ఈవో !TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, కోవిడ్ నియమాలు, టీటీడీ ఈవో !

 దర్శనం టిక్కెట్లు ఉంటేనే అలిపిరిలో ఎంట్రీ

దర్శనం టిక్కెట్లు ఉంటేనే అలిపిరిలో ఎంట్రీ

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్బంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం ముందుగా దర్శనం టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వెళ్లడానికి అవకాశం ఇస్తామని, దర్శనం టిక్కెట్లు లేని భక్తులు తిరుమల కొండ మీదకు వెళ్లడానికి అవకాశం ఇవ్వమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

 ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం

శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్నవారు వాక్సినేషన్ సర్టిఫికెట్లు కానీ, లేదా దర్శానానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు టీటీడీ అధికారులు మనవి చేశారు. టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ సారి శ్రీవారి బ్రమ్మోత్సవాలు నిర్వహిస్తామని ఇప్పటికే టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.

 టీటీడీ పాఠశాలలకు ఐఎస్ఓ గుర్తింపు

టీటీడీ పాఠశాలలకు ఐఎస్ఓ గుర్తింపు

టీటీడీ నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ గోవింద‌రాజ స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ ఒరియంట‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, ఎస్వీ సంగీత‌, నృత్య పాఠ‌శాల‌, ఎస్వీ నాద‌స్వ‌రం పాఠ‌శాల‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించారు.

 ఉత్తమ మౌళిక సదుపాయాలు

ఉత్తమ మౌళిక సదుపాయాలు

టీటీడీ పాఠ‌శాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, ఆహార పంపిణీ, ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి), ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 స‌ర్టిఫికెట్ల‌ను టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు.

 అందుకే టీటీడీ పాఠశాలలకు ఐఎస్ఓ గుర్తింపు

అందుకే టీటీడీ పాఠశాలలకు ఐఎస్ఓ గుర్తింపు

టీటీడీ పాఠ‌శాల‌ల్లో భౌతిక దూరం, శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ - 19 నిబంధ‌న‌ల బాగా పాటించినందుకు గుడ్‌ హైజెనిక్ ప్రాక్టీస్ (జిహెచ్‌పి) స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

టీటీడీ పాఠ‌శాలల్లో చ‌క్క‌టి విద్యా ప్ర‌మాణాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, రికార్డుల నిర్వ‌హ‌ణ చేస్తున్న టీటీడీ ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ‌మ‌తి సంధ్య‌, చంద్ర‌య్య‌, సురేంద్ర‌బాబు, శ్రీ‌మ‌తి గీతాంజ‌లి, శ్రీ‌మతి ప‌ద్మావ‌తి, క్రిష్ణ‌మూర్తి, శ్రీ‌మ‌తి జ‌మునారాణి, ర‌మ‌ణ‌మూర్తి, క్రిష్ణ‌మూర్తిల‌ను టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, టీటీడీ విద్యా శాఖాధికారి గోవింద‌రాజ‌న్, హెచ్‌వైఎం ఐఎస్ఓ స‌ర్టిఫికెష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యండి ఆల‌పాటి శివ‌య్య పాల్గొన్నారు.

English summary
TTD: Negative Covid-19 report or both vaccine doses mandatory for darshan at Tirumala temple. TTD Schools gets ISO certifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X