తమిళనాడు సీఎం పళనిసామి పదవికి ఎసరు: పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ !
తమిళనాడు సీఎం పళనిసామి పార్టీ పదవికి ఎసరుపళనిసామిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీటీవీ దినకరన్ దినకరన్ దూకుడుకు చెక్ పెట్టాలని సీఎం పళనిసామి వ్యూహం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పిస్తూ టీటీవీ దినకరన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నాడీఎంకే పార్టీ లెటర్ హెడ్ లో ఉప ప్రధాన కార్యదర్శి హొదాలో పార్టీ పదవి నుంచి సీఎం పళనిసామిని తప్పించామని దినకరన్ ప్రకటించారు.
సేలం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముఖ్యమంత్రి పళనిసామిని తప్పించి ఆ స్థానంలో వీరపాండి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్ కే. సెల్వంను నియమించామని దినకరన్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి విషయంలో సీఎం అయినా, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని దినకరన్ హెచ్చరించారు.

ఇదే సమయంలో తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలకు సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇప్పించడానికి కారణం అయిన పార్టీ విప్ రాజేంద్రన్ ను పార్టీ నుంచి తొలగిస్తూ దినకరన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం పళనిసామిని పార్టీ నుంచి బహిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.
చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపడానికి సీఎం పళనిసామి చర్యలు తీసుకుంటున్న సమయంలో దినకరన్ దూకుడు పెంచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తున్నారని, చివరికి అన్నాడీఎంకే పార్టీ ఎమైతుందో అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications