జైల్లో శశికళ స్కెచ్: సీఎంకు సమానంగా అక్క కుమారుడికి కేబినెట్ హోదా !

కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాల రాజధానుల రాయబారిగా తన అక్క కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ను నియమించి పళనిసామి పవర్ కు మరో పవర్ పాయింట్ పెట్టాలని బెంగళూరు జైల్లో

చెన్నై/బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అధికారిక రాయబారిని సిద్దం చేసుకుంటోంది అన్నాడీఎంకే ప్రభుత్వం. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ ఆదేశాలమేరకు ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ కు ఆ పదవి కట్టబెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

తమిళనాడులో సీఎం ఎడప్పాడి పళనిసామి పదవితో సమానంగా ప్రభుత్వంలో మరో పవర్ పాయింట్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర, తమిళనాడు రాష్ట్ర రాజధానుల మధ్య వారధిగా టీటీవీ దినకరన్ ను నియమించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. జైల్లో నుంచి శశికళ అక్క కుమారుడి కోసం చక్రం తిప్పుతున్నారు.

జయలలిత తరువాత

జయలలిత తరువాత

జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో, తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పాలనుకున్న శశికళకు తృటిలో సీఎం సీటు చేజారిపోయింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అనూహ్యరీతిలో చిన్నమ్మ జైలుపాలయ్యారు.

పెత్తనం చేజారిపోయింది

పెత్తనం చేజారిపోయింది

శశికళ కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడినా ఆమెకు ప్రత్యక్షంగా పెత్తనం సాగించే అవకాశం లేకుండాపోయింది. తనపెత్తం కొనసాగించాలని ఆలోచనతో తన ప్రతినిధిగా అక్క కుమారుడు దినకరన్ కు అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవివి కట్టబెట్టింది. బెంగళూరు జైల్లోని శశికళ ఆదేశాలను దినకరన్ అమలు చేస్తున్నారు.

దినకరన్ కు పూర్తిస్థాయి పెత్తనం

దినకరన్ కు పూర్తిస్థాయి పెత్తనం

శశికళ ఆదేశాల మేరకు ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో పూర్తిస్థాయి పెత్తనం చెలాయిస్తున్నాడు. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో దినకరన్ పాల్గోనడానికి అవకాశం లేదు. ప్రస్తుతం దినకరన్ కు ప్రభుత్వంతో అధికారిక సంబందం లేకుండాపోయింది.

జైల్లోనే పక్కా స్కెచ్ వేసిన శశికళ

జైల్లోనే పక్కా స్కెచ్ వేసిన శశికళ

తమిళనాడు ప్రభుత్వంలో తన అక్క కుమారుడు దినకరన్ కు పవర్ పాయింట్ అవసరం అని శశికళ ఆలోచించారు. జైల్లోనే పక్కా స్కెచ్ వేసి కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల రాజధానుల రాయబారిగా దినకరన్ ను నియమించాలని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి సూచించారు.

చిన్నమ్మను కలిసిన మంత్రులు

చిన్నమ్మను కలిసిన మంత్రులు

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రలో జైల్లో మంగళవారం శశికళను తమిళనాడు మంత్రులు సెంగోట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, కామరాజ్ తదితరులు కలిశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ను ప్రధాని కుర్చీలో కుర్చోబెట్టి పెత్తనమంతా సోనియాగాంధీ సాగించిన రీతిలోనే తాను పెత్తనం చెయ్యాలని శశికళ వారికి చెప్పారని సమాచారం.

తమిళనాడులో అంత సీన్ లేదని

తమిళనాడులో అంత సీన్ లేదని

అయితే తమిళనాడు రాజకీయాల్లో అలాంటి ప్రయత్నం వీలుకాదని మంత్రులు ఆమెకు సర్దిచెప్పడంతో తన మనిషిగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కు అధికార హోదా కల్పించాలనే నిర్ణయానికి శశికళ వచ్చారని సమాచారం.

ఢిల్లీ తమిళనాడు భవన్ లో మకాం

ఢిల్లీ తమిళనాడు భవన్ లో మకాం

కేంద్ర, తమిళనాడు ప్రభుత్వం వారధిగా దినకరన్ ను నియమిస్తే ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చని, అక్కడి నుంచి ఎంపీలతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా తమిళనాడు సచివాలయంలో దినకరన్ కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

ఎడప్పాడి పళనిసామికి చెక్

ఎడప్పాడి పళనిసామికి చెక్

దినకరన్ కోసం కేబినెట్ మంత్రి హోదాలో ఒక నామినేటెడ్ పదవిని సృష్టిస్తే తమిళనాడు ప్రభుత్వంలో అంతా తనపెత్తనం చెలాయించవచ్చని, ఆరకంగా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోవచ్చని శశికళ పక్కా ప్లాన్ వేశారు.

ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండాలని

ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండాలని

రాజ్యసభ మాజీ సభ్యుడైన దినకరన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వారధిగా నియమిస్తే తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అన్నిరకాల లావాదేవీలపై పెత్తనం చెయ్యడానికి అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు, అధికారులకు దినకరన్ అందుబాటులో ఉండేలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ఓ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో అధికార ప్రకటన విడుదల అవుతోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+