బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన దినకరన్
లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన అన్నాడీఎంకె బహిష్కృత నేత టీటీవి దినకరన్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఆయన బుదవారం నాడు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు.
న్యూఢిల్లీ: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన అన్నాడీఎంకె బహిష్కృత నేత టీటీవి దినకరన్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఆయన బుదవారం నాడు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు.
పార్టీ ఎన్నికల గుర్తు తమకే దక్కేలా చూసేందుకుగాను ఎన్నికల కమిషన్ అధికారులకు సుఖేష్ అనే మధ్యవర్తి ద్వారా లంచం ఇవ్వజూపారనే ఆరోపణలపై మంగళవారం నాడు దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే తొలుత ఈ విషయమై దినకరన్ మాత్రం తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. అయితే దినకరన్ ను పోలీసులు తీస్ హాజరి కోర్టులో హాజరుపరిచారు.కోర్టులో హాజరుపర్చడానికి ముందు నాలుగు రోజుల పాటు ఢిల్లీ పోలీసులు ఆయనను విచారించారు.
దినకరన్ తో పాటు ఆయన సహచరుడు మల్లిఖార్జున్ ను కూడ నేరపూరిత కుట్ర కేసు కింద అరెస్టు చేశారు పోలీసులు. ముడుపుల వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదని మొదటి నుండి బుకాయిస్తూ వచ్చిన దినకరన్ ఎట్టకేలకు తాను సుఖేష్ ను కలిసినట్టు ఒప్పుకొన్నాడు. అయితే తాను ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని దినకరన్ వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications