సీఎంపై అసంతృప్తితో 67 మంది ఎమ్మెల్యేలు, సినిమా చూపిస్తాం: ఇదో కొత్త బెదిరింపు !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలోనే సినిమా చూపిస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని నాయకులు అంటున్నారు. సీఎం ఎడప్పాడి పళనిసామి మీద ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలోనే సినిమా చూపిస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని నాయకులు అంటున్నారు. సీఎం ఎడప్పాడి పళనిసామి మీద ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస్తారని టీటీవీ దినకరన్ వర్గం అంటోంది.

టీటీవీ దినకరన్ సన్నిహితుడు కాశీనాథ్ భారతీ శనివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు టీటీవీ దినకరన్ ను చాల తక్కువ అంచనా వేస్తున్నారని అన్నారు. ఎడప్పాడి పళనిసామి ఎక్కువ కాలం అధికారంలో ఉండే చాన్స్ లేదని జోస్యం చెప్పారు.

TTV Dinakaran faction threatens team Edappadi Palanisamy

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద 67 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస్తారని టీటీవీ దినకరన్ వర్గం లో చేరిపోతారని కాశీనాథ్ భారతీ జోస్యం చెప్పారు. ఎప్పటికైనా అన్నాడీఎంకే పార్టీకి శశికళ, టీటీవీ దినకరన్ మాత్రమే నాయకత్వం వహిస్తారని కాశీనాథ్ భారతీ అన్నారు. అయితే టీటీవీ దినకరన్, ఆయన వర్గంలోని నాయకుల మాటలను ఎడప్పాడి పళనిసామితో సహ తమిళనాడు మంత్రులు చెవిలో వేసుకోవడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+