అసెంబ్లీలో ఎంట్రీ: టీటీవీ దినకరన్ మాస్టర్ ప్లాన్, సీఎం కుర్చి, సత్తా చూపిస్తా !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, త్వరలో మార్పులు జరుగుతాయని, వాటిని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అన్నారు. అతి త్వరలో తమిళనాడులో అద్బుతం జరుగుతోందని టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు.

శనివారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ త్వరలో తన సత్త ఏమిటో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు చూపిస్తానని పరోక్షంగా సవాలు చేశారు. అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

TTV Dinakaran has the master plan to drag MLAS from CM Palnisamy faction

జనవరి 8వ తేదీ నుంచి తమిళనాడు శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. శాసన సభ సమావేశాల సందర్బంలో తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని, ఆ సందర్బంలో అసెంబ్లీలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాలని టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran has the master plan to drag MLAS from CM Palnisamy faction to fall down the government, sources saying he will use this session to prove his individual capacity.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి