బెంగళూరు జైల్లో శశికళతో టీటీవీ దినకరన్ భేటీ, అక్కడ ఐటీ దాడులు, మాస్టర్ ప్లాన్ !
బెంగళూరు: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన శాసన సభ్యుడు టీటీవీ దినకరన్ గురువారం బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ నటరాజన్ తో భేటీ అయ్యారు.
Recommended Video

శశికళ ఫ్యామిలీకి చెందిన మిడాస్ కంపెనీ, మన్నార్ గుడి మాఫియా కార్యాలయాలు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న సందర్బంలోనే టీటీవీ దినకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మతో భేటీ అయ్యి చర్చించారు.

డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చెయ్యాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. ఒక్క రోజు ముందుగా శశికళతో బేటీ అయ్యి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. మూడు నెలల్లో తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని చెప్పిన టీటీవీ దినకరన్ ఇప్పుడు శశికళతో కలిసి సరికొత్త ప్లాన్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించని టీటీవీ దినకరన్ తన మద్దతుదారులతో కలిసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications