బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు సెంట్రల్ జైలు చేరుకున్న టీటీవీ దినకరన్: శశికళతో భేటీ, మంత్రుల పని ఫినిష్ !

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శి, అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తన్న శశికళను చూడటానికి ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్ బెంగళూరు నగరంలో అడుగుపెట్టా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శి, అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తన్న శశికళను చూడటానికి ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్ బెంగళూరు నగరంలో అడుగుపెట్టారు.

సీఎం పళనిసామి పదవికే ఎసరు: దినకరన్ దూకుడు: 20 మంది జంప్, మంత్రులపై వేటు !సీఎం పళనిసామి పదవికే ఎసరు: దినకరన్ దూకుడు: 20 మంది జంప్, మంత్రులపై వేటు !

సోమవారం సాయంత్రం టీటీవీ దినకరన్ తన అనుచరులతో కలిసి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ అయిన తరువాత దినకరన్ తన రాజకీయ భవిష్యత్తు విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

శశికళ ఏం చెబుతారు ?

శశికళ ఏం చెబుతారు ?

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన టీటీవీ దినకరన్ శశికళతో భేటీ కానున్నారు. తమిళనాడు రాజకీయాల గురించి శశికళతో చర్చించిన తరువాత ఓ నిర్ణయం తీసుకోవాలని దినకరన్ నిర్ణయించారని ఆయన అనుచరులు అంటున్నారు.

పార్టీ పదవి మీద ఆశలు !

పార్టీ పదవి మీద ఆశలు !

దినకరన్ అరెస్టు అయిన తరువాత ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని తమిళనాడు మంత్రులు గతంలో ప్రకటించారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దినకరన్ తనను పార్టీ నుంచి ఎవ్వరూ బహిష్కరించలేదని, ఆ అధికారం ఎవ్వరికీ లేదని మీడియాకు చెప్పారు. ఇప్పుడు శశికళతో భేటీ అయిన తరువాత దినకరన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అంటున్నారు ఆయన వర్గీయులు.

మంత్రుల విషయంలో చర్చ !

మంత్రుల విషయంలో చర్చ !

దినకరన్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన రోజే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో శశికళ, దినకరన్ ఫోటోలు, ఫెక్సీలు తొలగించారు. తరువాత వారి ఫోటోలు అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో కనిపించుకుండా చేశారు. తమ ఫోటోలు మాయం చెయ్యడనాకి కారణం అయిన నలుగురు మంత్రుల మీద శశికళకు ఫిర్యాదు చెయ్యాలని దినకరన్ నిర్ణయించారని తెలిసింది.

 మంత్రులపై వేటు పడుతోంది ?

మంత్రులపై వేటు పడుతోంది ?

తమిళనాడు సీనియర్ మంత్రులు జయకుమార్, సెంగోట్టయన్, తంగవేలు, వేలుమణి మీద కచ్చితంగా వేటు వెయ్యాలని 20 మంది ఎమ్మెల్యేలు దినకరన్ మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు. శశికళ అనుమతితో నలుగురు మంత్రుల పదవులకు మంగళంపాడేయ్యాలని దినకరన్ సైతం నిర్ణయించారని తెలిసింది.

చిన్నమ్మ ఆదేశాల కోసం దినకరన్ !

చిన్నమ్మ ఆదేశాల కోసం దినకరన్ !

చిన్నమ్మ శశికళ సూచనల మేరకు ఇక ముందుకు వెళ్లాలని దినకరన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. తాను జైలుకు వెళ్లిన తరువాత సీఎం ఎడప్పాడి పళనిసామి సొంత నిర్ణయాలు తీసుకుని మన్నార్ గుడి కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని శశికళకు ఫిర్యాదు చెయ్యాలని దినకరన్ నిర్ణయించారని తెలిసింది.

English summary
TTV Dinakaran who got bail in bribery case to meet VK Sasikala Natarajan today at Bengaluru Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X