జయ‘ఆర్ కే నగర్’ఉప ఎన్నికలు, ప్రచారానికి తెర: సర్వే విడుదల, బీజేపీకి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? అనే విషయంపై ఓ తమిళ పత్రిక సర్వే నిర్వహించింది. ఆర్ కే నగర్ సర్వేలో షాకింగ్ విషయం వెలుగు చూశాయి.
Recommended Video


ప్రచారానికి తెర
జయలలిత మరణంతో ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రానికి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పోటీ చేస్తున్నారు.

టీటీవీ దినకరన్
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ అభ్యర్థిగా మరుదు గణేష్ పోటీ చేస్తున్నారు. తమిళనాడు మీద తిరుగుబాటు చేసిన శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కుముదం సర్వే
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అంటూ ప్రముఖ తమిళ పత్రిక కుముదం సర్వే నిర్వహించింది. కుముదం సర్వేలో అన్నాడీఎంకే పార్టీ, డీఎంకే పార్టీలకు షాక్ ఇచ్చే విషయాలు వెలుగు చూశాయి.

అధికార పార్టీకి ఓటమి ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం సాధిస్తారని కుముదం తమిళ వార పత్రిక సర్వేలో వెలుగు చూసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి మధుసూదనన్ కి ఓటమి తప్పదని సర్వేలో వెలుగు చూడటంతో ఆ పార్టీ నాయకులు హడలిపోతున్నారు.

ఆ పార్టీ గుర్తులు కనపడితే !
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం, డీఎంకే పార్టీ సూర్యుడి చిహ్నంకు ఎంతో చరిత్ర ఉంది. ఈ రెండు గుర్తులు కనపడితే మరో పార్టీ గుర్తు చూడాలని తమిళ ప్రజలు ఆలోచించరు. రెండు పార్టీల్లో ఎదో ఒక దానికి తమిళ ప్రజలు ఓటు వేస్తారు.

దినకరన్ నెంబర్ వన్
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు ఫ్రెషర్ కుక్కర్ కేటాయించారు. కుముదం తమిళ పత్రిక సర్వేలో టీటీవీ దినకరన్ కు 27.5 శాతం, తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే పార్టీకి 26.9 శాతం, డీఎంకేకి 24.8 శాతం వస్తాయని వెలుగు చూసింది.

పాపం బీజేపీ
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇతరులకు 15.2 శాతం, ప్రముఖ తమిళ దర్శకుడు సీమాన్ కు చెందిన నమ్మ తమిళర్ కచ్చి పార్టీకి 5.1శాతం, బీజేపీకి 0.5 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెలుగు చూసింది. డిసెంబర్ 21వ తేదీ గురువారం ఆర్ కే నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications