సీన్ రివర్స్: వంచన.. వయా ఫేస్ బుక్, ప్రభుత్వ ఉద్యోగిని అయి ఉండీ ఇదేం పాడు పని?
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఒక యువతి ఫేస్‌బుక్ ద్వారా శ్రీమంతులైన యువకులను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో నాటకమాడి పెద్దఎత్తున డబ్బు గుంజుతోంది.
బెంగళూరు: సాధారణంగా అబ్బాయిలు సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను మోసగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడం తరచూ చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఒక యువతి ఫేస్‌బుక్ ద్వారా శ్రీమంతులైన యువకులను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో నాటకమాడి పెద్దఎత్తున డబ్బు గుంజుతోంది. ఈ కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితురాలు తుమకూరు జిల్లా దొగ్గనహళ్ళి గ్రామానికి చెందిన దొడ్డ మణి(28), మధుగిరి పట్టణంలోని రాష్ట్ర విద్యుత్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తోంది.
మూడేళ్లుగా తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా శ్రీమంతులైన యువకులను గుర్తించి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి స్నేహం చేసేది. అనంతరం వారిని ప్రేమ పేరుతో సినిమాలకు, పార్కులకు తిప్పేది. ఆ సమయంలో తన మొబైల్‌లో ఫోటోలు తీసుకునేది.
ఆ తరువాత తనకు అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసేది. మణి ఆగడాలు శృతి మించడంతో మోసపోయన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తుమకూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో ఈ కిలేడీపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటివరకు నిందితురాలిని అరెస్టు చేయలేదు. తాజాగా కొరటిగెరె పీఎస్‌లో నమోదైన ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు దొడ్డమణిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications