టీవీ డిబేట్లు వద్దు-బులిటెన్లే బెటర్-సోషల్ మీడియా కన్నా న్యూస్ పేపర్లకే- లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే
దేశవ్యాప్తంగా వార్తా వీక్షకుల వైఖరి మారుతోంది. గతంతో పోలిస్తే రాజకీయ నేతల మధ్య పెరుగుతున్న వివాదాలతో పాటు మారుతున్న పరిస్దితులు కూడా ప్రేక్షకులు, రీడర్స్ పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ప్రముఖ సర్వే సంస్ధ లోక్ నీతి-సీఎస్డీఎస్ అధ్యయనం చేసి వివరాలు ప్రకటించింది. ఈ వివరాలు చూస్తే ప్రేక్షకుల వైఖరి ఎలా మారుతోందో అర్దం చేసుకోవచ్చు.
దేశంలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న టీవీ ఛానళ్లలో చర్చల కంటే కూడా న్యూస్ బులిటెన్లవైపే ఎక్కువగా ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు లోక్ నీతి-సీఎస్డీఎస్ అధ్యయనం చెబుతోంది. తాజా అధ్యయనంలో 49 శాతం మంది ప్రేక్షకులు న్యూస్ బులిటెన్లవైపు మొగ్గుచూపుతుండగా.. కేవలం 12 శాతం మందే చర్చలపై ఆసక్తిగా ఉన్నారు. కానీ టీవీ ఛానళ్లు మాత్రం ఇవేవీ పట్టనట్టుగా గంటలకొద్దీ చర్చలతో ప్రేక్షకుల్ని విసిగిస్తున్నాయి. ప్రేక్షకుల ఆసక్తితో సంబంధం లేకుండా తమ వాదనను జనంలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.

మరోవైపు ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉన్న యూజర్లలో 90 శాతం మంది డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా న్యూస్ ను ఫాలో అవుతున్నట్లు లోక్ నీతి-సీఎస్డీఎస్ అధ్యయనం చెబుతోంది. అయితే వీరంతా డిజిటల్ న్యూస్ ను అంతగా నమ్మడం లేదని కూడా తెలుస్తోంది. అప్పటికప్పుడు అప్ డేట్ కోసం తెలుసుకోవడమే తప్ప దీన్ని విశ్వసించడం లేదని లోక్ నీతి-సీఎస్డీఎస్ అధ్యయనం తెలిపింది. మరోవైపు దూరదర్శన్, న్యూస్ పేపర్లు డిజిటల్, సోషల్ మీడియా కంటే ఇప్పటికీ విశ్వసనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనం చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నమ్మకంపై సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది వాట్సాప్‌పై చాలా తక్కువ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే 13 శాతం మందికి అస్సలు నమ్మకం లేదు. అదే విధంగా ట్విట్టర్ పై 54 శాతం మంది చాలా తక్కువ నుండి ఓ మోస్తరుగా నమ్మారు. 12 శాతం మందికి అస్సలు నమ్మలేదు.












Click it and Unblock the Notifications