అయోధ్య కేసులో ట్విస్టు: విచారణకు ముందే ఆ జడ్జి ఎందుకు తప్పుకున్నారు..?

Recommended Video

    Ayodhya Hearing Deferred To January 29 : Reactions Poured | Oneindia Telugu

    సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు వాయిదా పడింది. 20 ఏళ్ల క్రితం ఇదే కేసులో ఓ పార్టీ తరపున తాను వాదించినందున ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చోలేనని చెబుతూ ధర్మానం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. జస్టిస్ లలిత్ స్థానంలో మరో జడ్జి వచ్చే వరకు కేసు విచారణలో జాప్యం జరగనుంది. కొత్త ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనుంది.

    వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును గురువారం ఐదురుగు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ ధర్మాసనం సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పాటైంది. ఇక జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో జస్టిస్ లలిత్ బెంచ్ నుంచి తప్పుకోవడంతో కేసు విచారణ మరింత జాప్యం కానుంది. ముస్లిం పిటిషనర్ల తరపున రాజీవ్ ధవన్ అనే లాయరు లలిత్ జడ్జి స్థానంలో ఉండడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసు విషయమై అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరపున న్యాయవాదిగా జస్టిస్ లలిత్ వాదించారు.

    Twist in Ayodhya case: Justice Lalit steps out from the 5 judge bench, hearing postponed

    విచారణలో భాగంగా తొలుత కేసుకు సంబంధించిన మూలాంశాలను పరిశీలించి దాన్ని రోజువారి క్రమంలో విచారణ చేయాలా లేదా అనేదానిపై బెంచ్ నిర్ణయించనుంది. ఇదిలా ఉంటే అధికార బీజేపీ పార్టీతో పాటు మద్దతు పార్టీలు, ఇతర హిందూ సంఘాలు అయోధ్యలో రామమందిరం నిర్మాణం లోక్‌సభ ఎన్నికలు జరగకముందే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

    ఇదిలా ఉంటే త్వరతగతిన కేసును విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు గతేడాది తిరస్కరించింది. కేసు విచారణ వేగవంతం చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇందుకు న్యాయస్థానం తిరస్కరిస్తూ సుప్రీంకోర్టుకు ఏ కేసు ఎప్పుడు విచారణ చేయాలో తెలుసని ఒకరు చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేసును విచారణ చేయాలా లేక సమయం తీసుకుని విచారణ చేయాలా అన్నదానిపై కోర్టు ఈరోజు స్పష్టత ఇవ్వనుంది.

    ఇక రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణం చేయాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్థలం కూడా రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండటం వల్ల ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందని పలువురు ప్రముఖలు భావిస్తున్నారు. అంతకుముందు అదే చోట ఉన్న 16వ శతాబ్దం నాటి బ్రాబీ మసీదును 1992లో ఓ హిందూ సంఘానికి చెందిన కార్యకర్తలు కూల్చివేశారు. ఇక ఆనాటి నుంచి నేటి వరకు అక్కడ పరిస్థితి చాలా సున్నితంగా తయారైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+