Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్విట్టర్ నకిలీ అకౌంట్ లు: నటి రమ్య పాఠం, రాహుల్ గాంధీ ట్విట్ లైక్స్, వీడియో వైరల్!

Recommended Video

    Actress And Former MP Ramya Trolled Over Fake Accounts

    బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ నిషాలో బెంగళూరులో బహిరంగ సభలో మాట్లాడారని వివాదాస్పద ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి రమ్య ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ ఎలా ప్రారంభించాలి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటూ పాఠం చెబుతున్న ఓ వీడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. స్వీస్ బ్యాంక్ లో 60 ఏళ్లుగా నకిలి అకౌంట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రమ్యకు నకిలీ అకౌంట్స్ గురించి బాగా తెలుసు, రాహుల్ గాంధీ ట్వీట్ ల లైక్ ల కోసం ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

    మూడు నకిలీ అకౌంట్లు

    మూడు నకిలీ అకౌంట్లు

    కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నటి రమ్య ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మీరు ఈ రోజు ఒక్కొక్కరు మూడు అకౌంట్లు ఓపెన్ చెయ్యాలని, వాటిని ఎలా ఉపయోగించాలో తాను చెబుతానని, తనకు రెండు మూడు అకౌంట్లు ఉన్నాయని మైక్ లో చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది.

    రాహుల్ లైక్స్ కోసం

    రాహుల్ లైక్స్ కోసం

    రమ్య మేడమ్ నకిలీ ట్విట్టర్ అకౌంట్స్ ఎలా ప్రారంభించాలి అని పాఠం చెబుతున్నారు, ఈ మద్య కాలంలో రాహుల్ గాంధీ ట్విట్ లకు చాల లైక్స్ వస్తున్నాయి, మేడమ్ రమ్య ఇలా చెయ్యడం వలనే రాహుల్ గాంధీ ట్విట్ లకు లైక్ లు వస్తున్నాయని వెలుగు చూసిందని, వీరు బహిరంగంగా ప్రజలకు చిక్కిపోయారని ప్రతీక్ అనే వ్యక్తి ఆమె మీద మండిపడ్డారు.

    స్వీస్ బ్యాంక్ నకిలీ అకౌంట్స్

    స్వీస్ బ్యాంక్ నకిలీ అకౌంట్స్

    60 సంవత్సరాలుగా స్వీస్ బ్యాంక్ లో నకిలీ అకౌంట్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నటి రమ్యకు ఆ పార్టీ బుద్దులు బాగా అలవాటు అయ్యాయని. దొందూదొందే అంటూ మహర్షి అనే వ్యక్తి కామెంట్ చేశారు. స్వీస్ బ్యాంక్ లో నకిలీ అకౌంట్స్ ఎలా ప్రారంభించాలో బాగా తెలిసిన కాంగ్రెస్ నాయకులు రమ్యకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇప్పుడు రమ్య కార్యకర్తలకు నకిలీ ట్విట్టర్ అకౌంట్స్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారని మహర్షి మండిపడ్డారు.

    రమ్య ట్విట్టర్ వార్ !

    రమ్య ట్విట్టర్ వార్ !

    రమ్య ట్వీట్టర్ పాఠాలు వింటుంటే కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా ట్విట్టర్ వార్ జరుగుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని హాసన్ స్వామి అనే వ్యక్తి కామెంట్ చేశారు. రమ్య ట్విట్ లు ఇప్పటికే వివాదాలకు దారితీశాయని, ఇక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆమె మరెన్ని వివాదాలకు కారణం అవుతారో చూడాలని హాసన్ స్వామి అంటున్నారు.

     ఆ పదవిలో ఎందుకు ?

    ఆ పదవిలో ఎందుకు ?

    రమ్య ఇటీవల అనేక వివాదాలకు కారణం అవుతున్నారని, ఆమెను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవిలో ఆ పార్టీ నాయకులు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని రవిప్రసాద్ అనే వ్యక్తి ట్విట్ చేశారు. రమ్యను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రవిప్రసాద్ డిమాండ్ చేశారు.

    ఆమె ఏం చెప్పారంటే

    నటి రమ్య ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ప్రారంభించాలని చెప్పారు. అంతే కాని నకిలీ ఖాతాలు ప్రారంభించాలని ఎక్కడా చెప్పలేదని అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను సమర్థించారు. ఈ విషయాన్ని పెద్ద రాద్దాతం చేస్తున్నారని అరుణ్ కుమార్ అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+