Twitter New IT Rules: దారికొచ్చిన ట్విట్టర్-మరింత గడువివ్వాలని కేంద్రానికి వినతి-కరోనా పేరుతో
సోషల్ మీడియా దిగ్గజాల్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమలు విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దారికొచ్చింది. కొత్త ఐటీ రూల్స్ అమలుకు తాము సిద్ధమేనని, అయితే తమకు కొంత సమయం కావాలని కేంద్రాన్ని కోరింది. గత వారం కేంద్రం జారీ చేసిన ఫైనల్ నోటీసులపై స్పందించిన ట్విట్టర్ ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
కేంద్రం సవరించిన కొత్త ఐటీ నిబంధనల్ని అమలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కరోనా కారణంగా భారత్‌లో తమ సిబ్బందిపైనా ప్రభావం పడిందని, కాబట్టి అమలుకు కొంత గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ట్విట్టర్ లేఖ రాసింది. కేంద్రంతో ఈ మేరకు చర్చలు కొనసాగుతాయని ట్విట్టర్ వర్గాలు తెలిపాయి. ట్విట్టర్ భారతీయ నిబంధనలకు కట్టుబడే పనిచేస్తుందని, భవిష్యత్తులోనూ ఇదే వైఖరి కొనసాగిస్తామని వారు తెలిపారు.

మరోవైపు కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన ప్రతీ సోషల్ మీడియా సంస్ధా ఓ ఫిర్యాదు అధికారిని, మరో నోడల్ అధికారిని, మరో ప్రధాన నిబంధనల అమలు అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఫేస్‌బుక్ తమ ఫిర్యాదు అధికారిగా స్ఫూర్తి ప్రియను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వాట్సాప్ కూడా తమ ఫిర్యాదు అధికారిగా పరేష్ లాల్‌ను నియమించింది. వీరి పేర్లను సోషల్ మీడియాసంస్ధలు తమ ప్లాట్‌ఫామ్‌లో యూజర్లకు అందుబాటులో ఉంచాలని కేంద్రం చెబుతోంది.












Click it and Unblock the Notifications