శశి థరూర్‌కు ట్విట్టర్ షాక్... తాత్కాలికంగా ఖాతా బ్లాక్... మూర్ఖత్వమే అన్న ఎంపీ...

భారత్‌లో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ చేపడుతున్న చర్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. శుక్రవారం(జూన్ 25) కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ట్విట్టర్... కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ ఖాతాను కూడా తాత్కాలికంగా బ్లాక్ చేసింది. తొలుత రవిశంకర్ ప్రసాద్‌తో పాటే శశి థరూర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన ట్విట్టర్... ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ ఆయన ఖాతాను బ్లాక్ చేసింది.

యూఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీరైట్ (డీఎంసీఏ) చట్టం ఉల్లంఘన కింద రవిశంకర్ ప్రసాద్,శశి థరూర్‌ల ఖాతాలను నిలిపివేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.ఈ వ్యవహారంపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ట్విట్టర్ ఖాతాను నిలిపివేసే బదులు... తన పోస్టులోని వీడియోని కనిపించకుండా చేస్తే సరిపోయేది కదా అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. కేంద్రం నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలను నిలిపివేయాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు.

twitter shock to mp shashi tharoor locks his account for second time

అంతకుముందు,కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేయగా... ఇది పూర్తిగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యక్తిగత అకౌంట్‌కు యాక్సిస్ నిరాకరించడానికి ముందు నోటీసు ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందన్నారు.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల్ని అమలు చేయడంలో ట్విట్టర్‌ జాప్యం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ట్విట్టర్ విధానాలు ఇక్కడి స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంలో ట్విట్టర్ ఇప్పటికీ నాన్చుడు ధోరణినే అవలంభిస్తోంది. కొత్త నిబంధనల అమలుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పిందే తప్ప... ఇందుకు నిర్ణీత కాల వ్యవధిని ఫిక్స్ చేయలేదు.దీంతో కేంద్రం నిబంధనలను ట్విట్టర్ ఎప్పటిలోపు అమలుచేస్తుందన్నది స్పష్టత లేదు.

ఓవైపు కేంద్రం రూపొందించిన నిబంధనలకు ట్విట్టర్ ఇప్పటికీ అంగీకారం తెలపకపోవడం... మరోవైపు యూఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీరైట్ పేరుతో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. అసలే కేంద్రం ట్విట్టర్‌పై గుర్రుగా ఉన్న సమయంలో ఆ సంస్థ ఇలాంటి చర్యలకు దిగడం చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+