వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంభీర్‌కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్‌పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవలే బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతం గంభీర్‌ల మధ్య ట్విటర్ వేదికగా యుద్ధం జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాష్ట్రపతి కావాలని ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్లపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు గౌతం గంభీర్. ఆర్టికల్ 35-ఏ మరమత్తులు చేస్తే ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాష్ట్రపతి వస్తారంటూ ఎద్దేవా చేశారు. ఇక ఆర్టికల్ 35 ఏ జమ్ముకశ్మీర్‌లో ఎవరు శాశ్వతమైన స్థానికులు ఎవరు కాదో అనే అంశాన్ని వివరిస్తుంది.

Twitter war: Stick to what you know, Omar Abdullah to Gautam Gambhir

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ప్రత్యేక రాష్ట్రపతి కావాలని ఒమర్ అబ్దుల్లా కోరుకుంటున్నారు. నాకేమో సముద్రంపై నడవాలని ఉంది. ఆయన ప్రత్యేక రాష్ట్రపతి కావాలనుకుంటున్నారు ... నాకేమో పందులు గాల్లో ఎగరితే చూడాలని ఉందంటూ ట్వీట్ చేశారు గౌతం గంభీర్. అసాధ్యమయ్యే పనులు చేయడం ఎవరి తరం కాదని ఎద్దేవా చేశారు గౌతం గంభీర్. దీనికి కౌంటర్‌ ఇచ్చారు ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా.

"గౌతం గంభీర్... నేను నీలా క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. నాకు తెలుసు నేను అందుకు సరిపోను అని. జమ్ముకశ్మీర్ గురించి కూడా నీకు పెద్దగా తెలియదనే అనుకుంటాను. అదో చరిత్ర. నీకు అవగాహన ఉన్న క్రికెట్‌ గురించి మాట్లాడు. లేదా ఐపీఎల్ గురించి ట్వీట్ చేయి " అంటూ కౌంటరిచ్చారు ఒమర్ అబ్దుల్లా.ఓ సభలో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా ఒకప్పుడు జమ్ముకశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండేదని గుర్తు చేశారు. ఆనాటి ఒప్పందాలను తిరిగి అమలు చేయాలని ఇలా అయితేనే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని వస్తారని అన్నారు.

English summary
Gautam Gambhir, a newly-minted BJP leader, provoked a sharp retort from Omar Abdullah today as they plunged into the debate on a "separate PM for Jammu and Kashmir". "Stick to stuff you know," Omar Abdullah curtly told the former cricketer on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X