రిసార్ట్‌లో టెక్కీపై అత్యాచారం కేసు: ఇద్దరు అరెస్టు

లక్కీనాథ్ (20), పర్సనాగామ్ (22) అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో తలుపు తట్టిన శబ్దం వినిపించిందని, ఇద్దరు వ్యక్తులు గ్లాస్ డోర్స్ గుండా గదిలోకి గదిలోకి ప్రవేశించారని బాధితురాలు చెప్పింది.
సహ ఉద్యోగులతో కలిసి విహార యాత్రకు వచ్చిన ఐటి ఉద్యోగిని శుక్రవారంనాడు అత్యాచారానికి గురైన ఘటన తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఆమె కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఐలాండ్‌కు వచ్చారు. ఇక్కడ పోహియూర్ రిసార్ట్‌లోని స్టార్ కేటగిరీ విభాగంలో బస చేశారు. ఆమె గదిలోకి గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు.
తీవ్రంగా గాయపడిన బాధితురాలు మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఉన్న గది తలుపు బాగా లేదని పోలీసులు గుర్తించారు. కాగా, తాను దశాబ్దాల క్రితం బెంగాల్ నుండి వచ్చి బెంగళూరులో సెటిల్ అయినట్లు యువతి పోలీసులకు తెలిపారు. ఇది కేరళ రాజధాని తిరువనంతపురంకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది.












Click it and Unblock the Notifications