భర్తను చంపేసి జైలుకు వెళ్లింది, నేడు పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో, దుమ్ము లేపేశారు!
బెంగళూరు: పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో మహిళ మెడలో బంగారు గొలుసులు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించి స్థానికుల చేతిలో తన్నులు తిన్న సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లా, కుందాపురలో జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన ఫిర్దోసి (29), ఆమె ప్రియుడు మహమ్మద్ ఆసీఫ్ లను స్థానికులు చితకబాది దుమ్ము లేపేసి పోలీసులకు అప్పగించారు.
కుందాపురలోని జీఎం. రోడ్డులో మెహరున్నిసా (74) అనే వృద్దురాలు నివాసం ఉంటున్నది. మెహరున్నిసా కుటుంబానికి అహమ్మద్ ఆసీఫ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మెహరున్నిసా ఇంటిలో ఎవరెవరు ఉంటారు, వాళ్లు ఎప్పుడు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు అనే విషయాలు మహమ్మద్ ఆసీఫ్ కు బాగా తెలుసు.

శుక్రవారం రాత్రి అహమ్మద్ ఆసీఫ్ అతని ప్రియురాలు ఫిర్దోసితో కలిసి మెహరున్నిసా ఇంటికి వెళ్లాడు. తెలిసిన వాళ్లే కదా అని మెహరున్నిసా తలుపు తీసి వాళ్లను ఇంటిలోకి పిలిచింది. పెళ్లి పత్రిక మెహరున్నిసా చేతిలో పెట్టిన నిందితులు ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లాక్కొని ఇంటి బయటకు వచ్చి పారిపోవడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో మెహరున్నిసా గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు వచ్చి మహమ్మద్ ఆసీఫ్, అతని ప్రియురాలు ఫిర్దోసిని పట్టుకుని చితకబాది వారి చేతిలో ఉన్న బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని ఇద్దర్నీ పోలీసులకు అప్పగించారు. నిందితురాలు ఫిర్దోసికి గతంలో సమీర్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది.
ఫిర్దోసి ప్రియుడు మహమ్మద్ ఆసీఫ్ తో కలిసి భర్త సమీర్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేసింది. సమీర్ ను నమ్మించి తమిళనాడుకు పిలుచుకుని వెళ్లిన ఫిర్దోసి ప్రియుడితో కలిసి అతన్ని చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫిర్దోసి, ఆమె ప్రియుడు మహమ్మద్ ఆసీఫ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. గత నెల బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన ఫిర్దోసి, మహమ్మద్ ఆసీఫ్ మళ్లి చోరీ చెయ్యడానికి ప్రయత్నించి అరెస్టు అయ్యి జైలుకు వెలుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications