దలైలామాకు భద్రత: బుద్ధగయలో రెండు బాంబులు
పాట్నా: బీహార్‌లోని బుద్ధగయలో శుక్రవారం సాయంత్రం రెండు నాటు బాంబులు బయటపడ్డాయి. ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇలా వెళ్లిన కొద్దిసేపటికే ఆ బాంబులు బయటపడ్డాయి.
కాలచింతన్ మైదానంలోని వంటగదిలో చిన్నపాటి పేలుడు సంభవించింది. దాంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. దాంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలచక్ర మైదానంలో రెండు బాంబులు కనిపించాయి.

పాట్నా రేంజ్ డిఐి వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ గాలింపు చర్యలు చేపట్టినట్లు పాట్నా రేంజ్ ఐిపి ఎన్ హెచ్ ఖాన్ చెప్పారు. గాలింపు చేపట్టినప్పుడు పేలిన థర్మాస్ ఫ్లాస్క్ కనిపించిందని, దానివల్ల శబ్బం వచ్చి ఉంటుందని ఆయన అన్నారు.
2013ల బుద్ధగయలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో ఐదుగురు గాయపడ్డారు.సిమీ కార్యకర్తలు పేలుళ్లకు పాల్పడినట్లు తర్వాత తెలిసింది.












Click it and Unblock the Notifications