Manipur Road Accident: మణిపూర్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి..!
మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఘోరం జరిగింది. బుధవారం విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది విద్యార్థులు చనిపోయారని స్థానికి మీడియా పేర్కొంది. నోనీ జిల్లాలోని బిస్నుపూర్-ఖౌపుమ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది.విద్యార్థులను తీసుకువెళుతున్న రెండు బస్సులు యారిపోక్‌లోని తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందినవిగా తెలుస్తుంది. బస్సులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్ వైపు వెళ్తున్నాయి.
ఐదుగురు విద్యార్థులు
ప్రమాద స్థిలిలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యైరిపోక్‌లోని తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన సుమారు 36 మంది విద్యార్థులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు ఉదయం 11 గంటలకు ఇంఫాల్‌కు నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్‌సాయి గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది.

సపమ్ రంజన్ సింగ్
ఇప్పటి వరకు మృతుల సంఖ్యపై సంఖ్య స్పష్టమైన సమాచారం లేదు. అయితే మరణాలు పెరిగే అవకాశం ఉందని నోనీ జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని ఇంఫాల్‌లోని ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్లకు తరలించినట్లు వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
Several students feared dead in road accident in #Manipur's #Khoupum#ACCIDENT #roadaccident pic.twitter.com/QWu9Gzgc5b
— SANDEEP SINGH RAWAT (@iamsandeeprwt) December 21, 2022












Click it and Unblock the Notifications