కశ్మీర్ లో కొనసాగుతున్న తుపాకుల మోత.. ఒక్కరోజే రెండు ఎన్‌కౌంటర్లు
శ్రీ నగర్ : కశ్మీర్ తుపాకుల మోతతో దద్ధరిల్లుతోంది. మంగళవారం ఒక్కరోజే రెండు ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. తెల్లవారుజామున కుల్గాం జిల్లాలోని రెద్వనీ ఏరియాలో సైన్యం సోదాలు చేపట్టింది. దీంతో అలర్టైన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అటు భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
అటు ఆ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగానే.. ఇటు సౌత్ కశ్మీర్ పుల్వామా సమీపంలోని ట్రోల్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ మొదలైనట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆ పరిసరాలను చుట్టుముట్టాయి. అయితే టెర్రరిస్టులు జనావాసాల మధ్య ఉండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

వరుస ఎన్‌కౌంటర్లతో కశ్మీర్ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆదివారం షోపియాన్ లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఏడుగురు టెర్రరిస్టులతో పాటు స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ లో టెర్రరిస్ట్ కీలక నేతలను సైన్యం అంతమొందించింది.












Click it and Unblock the Notifications