మోసపోయామని ఇద్దరు యువతుల ఆత్మహత్య

Two jilted girls sip poison, end lives
బెంగళూరు: తమను తాము ప్రేమించిన యువకులు మోసం చేశారని మనస్తాపానికి గురైన ఇద్దరు యువతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. మృతి చెందిన ఇద్దరు యువతులు కూడా 18ఏళ్ల వయస్సువారే.

కెజిహళ్లిలోని కుషల్ నగర్‌కు చెందిన షాజియా బేగం, డిజె హళ్లికి చెందిన రఖియా బేగంలు పులికేశినగర్‌లోని రోడ్‌లో అపస్మారక స్థితిలో పడివున్నారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. షాజియా మార్గమధ్యలోనే మృతి చెందగా, చికిత్స పొందుతూ రఖియా కూడా ప్రాణాలు వదిలింది.
పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు.

యువతులు అపస్మారక స్థితిలో ఉన్న చోట రెండు పెస్టిసైడ్ బాటిళ్లు దొరికాయని పోలీసులు చెప్పారు. విషం తాగడం వల్లే యువతులు మృతి చెందారని వైద్యులు కూడా నిర్ధారించారు. కాగా, నాగవరలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ ఇద్దరు యువతులు బిబిఎం మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే వారు ఎలాంటి సూసైడ్ నోట్‌ను రాయలేదు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆ ఇద్దరు యువతులు మరో ఇద్దరు యువకుల ప్రేమలో పడి మోసపోయారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతుళ్లు చనిపోయారన్న వార్త తెలిసి ఆ యువతుల తల్లిదండ్రులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. వారి రోదనలు మిన్నంటాయి. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో కొడుక్కి నిప్పింటించాడు

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛింద్వారా జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కన్న కొడుకు(15)కు నిప్పంటించాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మొదట ప్రమాదంగా చిత్రీకరించిన తండ్రి కుటుంబసభ్యులను నమ్మించాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందడంతో అతని తల్లి పోలీసులకు తన భర్తపై ఫిర్యాదు చేసింది. వికలాంగుడైన కారణంగానే తన కొడుకును తన భర్త నిప్పంటించి హత్య చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+