వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కస్టడీలో యువకుడు మృతి: ఇద్దరు కేరళ పోలీసులకు మరణశిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: 23 ఏళ్ల యువకుడు కస్టడీలో మృతి చెందిన కేసులో ఇద్దరు పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. తిరువనంతపురం పోలీస్ స్టేషన్లో 13 ఏళ్ల క్రితం కస్టడీలో ఉన్న యువకుడిని చిత్రహింసలకు గురి చేసి అతని మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఇద్దరు పోలీసులను కోర్టు నేరస్తులుగా తేల్చింది. వారికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం మరణశిక్ష విధించింది. ఇది అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదని, సివిల్ పోలీసు అధికారులైన జీతా కుమార్, శ్రీకుమార్‌లు ఈ శిక్షకు అర్హులని సీబీఐ జడ్జి కే నజర్ పేర్కొన్నారు. మృతుడి తల్లికి దోషులు చెరో రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.

Two Kerala cops get death for custodial murder of 23 year old

నాడు పోలీసు కస్టడీలో చనిపోయిన యువకుడు ఉదయ్ కుమార్. ఈ కేసులో న్యాయం కోసం అతని 68 ఏళ్ల తల్లి ప్రభావతి అమ్మ 13 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఇప్పుడు న్యాయస్థానం దోషులకు శిక్ష విధించింది.

ఈ కేసులో మరో ముగ్గురికి కూడా న్యాయస్థానం మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. హరిదాసు, అజిత్ కుమార్, ఈకే సాబులు ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేసినందుకు వారికి మూడేళ్ల చొప్పున శిక్ష విధించారు.

English summary
A special Central Bureau of Investigation (CBI) court on Wednesday awarded the death sentence to two policemen who were convicted of torturing a 26-year-old man to death 13 years ago in a police station in Thiruvananthapuram, the Kerala capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X