మరో దారుణం: బిడ్డను విసిరేసి.. కదులుతున్న కారులో ఆమెపై గ్యాంగ్ రేప్
లక్నో: దేశంలో అత్యాచార ఘటనలకు తెరపడటం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై కన్నేస్తే అంతుచూస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. నిందితుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో మహిళ సామూహిక అత్యాచార దాడికి గురైంది.

ఎవరామె?:
ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు ఆర్కే మెహతా అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆర్కే మాటలు నమ్మిన ఆమె సోమవారం సాయంత్రం అతనితో మాట్లాడేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెను తన కారులతో ఎక్కించుకున్న మెహతా.. కొద్ది దూరం వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

బిడ్డను విసిరేసి:
ఆర్కే లైంగిక దాడిని ఆమె గట్టిగా ప్రతిఘటించింది. దీంతో కదులుతున్న కారు నుంచే ఆమె మూడేళ్ల కుమారుడిని నిందితుడు బయటకు విసిరేశాడు. అనంతరం మత్తు మందు కలిపిన మద్యాన్ని ఆమెతో బలవంతంగా తాగించాడు.

సామూహిక అత్యాచారం:
మత్తు మందు ప్రభావంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. మెహతా, అతని స్నేహితుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను చపార్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రిలో చిన్నారి:
కారులో నుంచి బయటకు విసిరేయడంతో ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న సమయంలో కొంతమంది స్థానికులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications