కేసు పెట్టడానికి వెళ్లి బుక్ అయిన యంగ్ మోడల్స్
ముంబై: కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు యంగ్ మోడల్స్ వారే కేసులో ఇరుక్కున్న సంఘటన ముంబై నగరంలో జరిగింది. ఎందుకురా వచ్చాము దేవుడా అని ఇప్పుడు వారిద్దరూ తలలు పట్టుకుంటున్నారు. పలు సెక్షల కింద వారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం రాత్రి ముంబై నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ కు ఇద్దరు యంగ్ మోడల్స్ వెళ్లారు. ఈ యువతులు ఇద్దరు పలు టీవీ సీనియల్స్ లో నటిస్తున్నారని సమాచారం.
పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు మోడల్స్ నిత్యం విలాసంవతమైన కారులో వచ్చే వ్యక్తి తమను వేధిస్తున్నాడని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మహిళ కానిస్టేబుల్ ఇద్దరి దగ్గర వివరాలు సేకరిస్తున్నారు. ఆ సమయంలో సీన్ రివర్స్ అయ్యింది.

కేసు పెట్టడానికి వెళ్లిన ఇద్దరు మోడల్స్ మహిళ కానిస్టేబుల్ తో గొడవ పెట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటామాట పెంచుకున్నారు. మహిళ కానిస్టేబుల్, ఇద్దరు మోడల్స్ మద్య వాగ్వివాదం తారాస్థాయికి చేరింది.
ఉన్నతాధికారులు మోడల్స్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే వారు వినలేదు. మహిళ కానిస్టేబుల్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని, ఆమె విధులు అడ్డుకొవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తు పోలీసు అధికారులు కేసులు నమోదు చేశారు. మోడల్స్ ఇప్పుడు తలలు పట్టుకున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications